Home » సహాయం చేయడం నేర్చుకున్న చేప

సహాయం చేయడం నేర్చుకున్న చేప

by Vinod G
0 comment

ఒక చిన్న చెరువులో చాలా చేపలతో పాటు ఫిన్లీ అనే చేప కూడా నివసిస్తూ ఉండేది. అయితే ఫిన్లీ ఎప్పుడూ తన స్వార్ధం మాత్రమే చూసుకునేది, పక్కనోళ్లు ఏమైపోయినా పట్టించుకునేది కాదు. ఆహారం తనకు సరిపడినంత కాకుండా ఇంకా కావాలి, దాచుకోవాలి అని పరితపిస్తూ నీటిలో వెతుకుతూ ఉండేది.

ఒక రోజు ఫిన్లీ ఆహారం కోసం వెతుకుతుండగా వలలో చిక్కుకున్న మరొక చేప ఫిన్లీ కంట పడింది. అప్పుడు వలలో చిక్కుకున్న చేప సహాయం చేయమని ఫిన్లీని వేడుకుంది. అయితే ఫిన్లీ మాత్రం నేను సహాయం చేస్తే నా సమయం వృధా అవుతుంది, ఆహారం వెతుకులాటకు సమయం సరిపోదు అనుకుని చూసీచూడనట్టుగా అక్కడ నుండి ఫిన్లీ వెళ్ళిపోతుంది.

ఆ రాత్రి, ఫిన్లీ వలలో చిక్కుకున్న చేప గురించి ఆలోచిస్తూ నిద్రపోదు. చివరికి తన తప్పు తెలుసుకొని మరుసటి రోజు, ఫిన్లీ తిరిగి వచ్చి వలలో చిక్కుకున్న చేపను విడిపించడానికి తన రెక్కలను ఊపి చివరికి ఎలాగోలాగ దాని ప్రాణాలు కాపాడుతుంది.

fish moral story for kids

విముక్తి పొందిన చేప ఫిన్లీకి కృతజ్ఞతలు తెలియజేసి, దానికి తన ఆహారంలో వాటా ఇస్తుంది. అప్పుడు దాచుకోవడం కంటే పంచుకోవడం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని ఫిన్లీ గ్రహిస్తుంది. .

నీతి: స్వార్థం కంటే నిస్వార్థత మరియు దయ గొప్ప ప్రతిఫలాన్ని తెస్తాయి.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి

You may also like

Leave a Comment