Home » బద్ధకానికి యుద్ధం – కథ

బద్ధకానికి యుద్ధం – కథ

by Haseena SK
471 views
baddhakaniki yuddham moral story

సోమాపురం అనే ఊళ్లో శివయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు ఆయన కొడుకు రాము మహాసోమరి పెద్దవాడైనా సరే ఏ పనీ చేయకుండా తిరుగుతుండేవారు ఈ విషయం శివయ్య అతన్ని ఎన్నిసార్లు మంద లించినా పట్టించుకునేవాడు కాదు చేసేదేం లేక శివయ్య భాదపడుతూ ఉండేవాడు. ఒక రోజు సోమాపురానికి కాశీ నుంచి ఒక సాధవు వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్లి ఊళ్లోని వాళ్లంతా ఆశీస్సులు తీసుకుని తమ సమస్యల్ని చెప్పుకున్నారు వాళ్లలో శివయ్య ఏమీ మాట్లాడకపోయినా.

దిగాలుగా ఉండటం గమనించిన సాధువు దగ్గరికి పిలిచి విషయం కనుక్కున్నాడు. సాయంత్రం గ్రామస్థులు తో మాట్లాడేప్పుడు ఈ ఊళ్ళో ఒక బద్ధకస్తుడు ఉన్నాడు. అతని వల్లే ఊరికి చెడు జరుగుతోంది. వచ్చే గురువారం నాడు అతని ఇంట్లో వాళ్లు మాయమైపోతారు. అని చెప్పాడు. గురువారం వచ్చేసరికి రాము తల్లిదండ్రులు కనిపించడం దన్ను వార్త ఊరంతా గుప్పుమంది. 

 జరుగుతోందంటూ అందరూ రాముని దూరం పెట్టారు ఇంట్లో వాళ్లూ లేకపోవడంతో అన్నం కోసం కూడా అతను బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది.   ఈ పరిస్థితిని భరించలేని రాము స్వామి కాళ్ల మీద పడ్డాడు తనే నేరం చేయకపోయినా అందరూ తనని అసహ్యించుకుంటున్నారని భోరుమన్నాడు అప్పడా సాధువు నువ్వు నీ తల్లిదండ్రుల్నీ చూసుకోవలసిన వయసులో ఏ పనీ చేయకుండా ఊరికే తిని తిరుగుతూ కాలం గడుపుతూన్నావు. 

నీ భాద్యతల్నీ నిర్వర్తించకుండా ఉండటం నేరమే కదా అని అన్నాడు. దింతో తప్పు తెలుసుకున్న రాము కష్టించి పని చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు తల్లిదండ్రుల తనని చూస్తే ఎంతో సంతోషపడతారని అనుకుంటూ ఉండేవాడు కొన్నాళ్లకు సాధువు మళ్లీ ఆ ఊరికి వచ్చాడు అందరితో మాట్లాడుతూ బద్ధకస్తుడు. మారిపోవడం వల్ల అతని ఇంట్లో వాళ్లు తిరిగి వస్తారు. అని చెప్పాడు మర్నాడే రాము తల్లిదండ్రులు ఊళ్లో అడుగుపెట్టారు. అంతా స్వామి మహిమ అని ఊళ్లో వాళ్ళకు రాము తల్లిదండ్రులు తమ కొడుకుని మార్చినందుకు స్వామికి మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.