కాశీనాధుడు అనే వ్యక్తి ఒక రోజు అరణ్యమార్గం ద్వారా వెళుతున్నారు. నడిచి నడిచి అతనిక నీరసం వచ్చింది. అక్కడ ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆచెట్టు దశదిశలకు వ్యాపించినట్లు ఎంతో పెద్దదిగా వుంది. చెట్లు నీడగా చల్లగా ఉంది. అలసిపోయిన కాశీనాధుడు హాయిగా ఆ చెట్టు కింద మిశ్రమించాడు. అక్కడ చెట్టు కింద అంతటా చిన్న చిన్న మర్రి కాయలు వున్నాయి.
అక్కడికి కొంచెం దూరంలో ఒక గుమ్మడి తీగ అల్లుకుని ఉంది. దానికి కాసిన గుమ్మడి కాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి.కాశీనాథునికి నువ్వ వచ్చింది. భగవంతుడికి ఆలోచ జ్ఞానం తక్కువగా వున్నట్టుంది. ఇంత పెద్ద మర్రిచెట్టుకు ఇంత చిన్నకాయలు అంత సన్న గుమ్మడి తీగకు అంత పెద్ద కాయలు స్పష్టించాడు అనుకుంటూ కాశీనాథుడు నిద్రపోయాడు. అతను నిద్రలేచి చూసేప్పటికి అతని మీద చిన్న చిన్న మర్రి కాయ పడి వున్నాయి. అతనికి వెన్నులో జలదరిచింది.
ఒకవేళ ఆ గుమ్మడి కాయలంత కాయలు ఈ మర్రిచెట్టుకు కాసివుంటే అవి మీద పడి తన తల పగిలి. చచ్చేవాడకాబట్టి.దేవుడు తెలివైనవాడు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ నీతి కథలును సందర్శించండి.