Home » రాష్ట్రంలో జికా వైరస్ ఒకే ఇంట్లో – ఎక్కడో తెలుసా!

రాష్ట్రంలో జికా వైరస్ ఒకే ఇంట్లో – ఎక్కడో తెలుసా!

by Vishnu Veera
0 comment

ముందుగా తెలుగు రీడర్స్ కి స్వాగతం.

మహారాష్ట్రలోని పూణె పట్టణం లో 2 జికా వైరస్ కేసులు ఒకే ఇంట్లో రావడంతో తీవ్ర సంచలనంగా మారింది. పూణెకు చెందిన ఒక డాక్టర్ కు కొన్ని రోజుల క్రితం శరీరంపై దద్దుర్లు, జ్వరం రావడంతో ఆ డాక్టర్ తన బ్లడ్ శాంపిల్స్ ని పూణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించారు.

ఈ నెల 21వ తేదీన ఆ డాక్టర్‌కు జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు పూణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. ఆ తరువాత డాక్టర్ కుటుంబ సభ్యులకు కూడా బ్లడ్ టెస్ట్‌లు చేయగా.. అ డాక్టర్ కి పుటిన 15 ఏళ్ల కుమార్తెకు కూడా జికా వైరస్ పాజిటివ్‌గా తేలింది.

మిగిలిన వారికి జికా వైరస్ సోకలేదని అధికారులు తెలిపారు. వారిద్దరికీ జికా వైరస్ సోకడంతో. ఆ పరిసరాల్లో జికా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ డాక్టర్, ఆయన కుమార్తె ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment