ఏడేడు లోకాలు యేలేటి రాముడే
అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు
పతి అంటూ సతి అంటూ
మురిసిన రాధనే వదిలేసి
రుక్మిణిని పేలాడినట్టు
పార్వతి ఉండంగా అలీగా
గంగానే ఎక్కించుకున్నాడు తోడుగా
ప్రేమనే మాటనే లేదుగా
పెంచుకుంటే ప్రాణాలే పోయేరా
ఏడేడు లోకాలు యేలేటి రాముడే
అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు
పతి అంటూ సతి అంటూ
మురిసిన రాధనే వదిలేసి
రుక్మిణిని పేలాడినట్టు
బంధాలంటూ మా బతుకు మర్చి
మాతో ఆటలే ఆడుతావో
భారమైన ఓ బతుకునిచ్చి
బతుకు ఆగంలో తోసేస్తువో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
నా పిల్ల యాడున్నదో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ గయ్యాల పాలయ్యేనో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
నా పిల్ల యాడున్నదో
ఎట్లా సెప్పురా ఓదేవా
నా ప్రేమ గయ్యాల పాలయ్యేనో
ఓ చిన్ననాడు నీ యెంట తిరిగిన
వింత సిత్రమే గదా
చేతుల్లో చెయ్యేసి చెప్పిన ఆ మాట
ఈ రోజు ఎటు పోయేనే
గుండెలో లోతుల్లో
గంజాయి గాటోలే నిండినావు
నేనేమి సేతు
నడిరేయి చీకట్ల నువ్వు లేక నేనిట్ల
చచ్చి శవమైతినే నీ మీద ఒట్టు
ఏ దయ లేని సూపుల
సావు దెబ్బ కొట్టి చూసి పోకలా
నీ చేతి గీత తాకే వేళనా
నన్ను చంపినా సంతోషమే గదా
ఏడు కన్నుల ఏడు కొండల సామి
ఈ గోసాలే ఏందిరో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ సిక్కులో దోసేస్తువో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
ఈ గోసాలే ఏందిరో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ సిక్కులో దోసేస్తువో
సిక్కుల్ల దోసేస్తువో
పర్వాలేదమ్మో నీ మాట నేనే
మళ్లివస్తానన్న ఆ మాటలన్నీ
మరిచిపోకమో ఈ పిచ్చి గుండె
సచ్చెదాక నీకై పిచ్చోడినే గాని
తెనోలె కత్తిలా పూసిన
నాకే గుచ్చినవే గుర్తులేదన
ఈ మట్టిలో కలిసానే కోయిల
మచ్చలేనో పెట్టి మరిచిపోతివా
దండాలెన్నో పెట్టుకున్న దేవుళ్లకు
గన్ని బాధలిచ్చానో
దెగ్గరలేవని తెలిసిన దేవుడే
దిక్కులన్నీ తెంపేనో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
నీ ఆటలే ఆపారో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ బుక్కిపాలే చేస్తీవో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
నీ ఆటలే ఆపారో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ బుక్కిపాలే చేస్తీవో
బుక్కిపాలే చేస్తీవో
____________________________________________________
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
సాహిత్యం: దివ్య బోనగిరి (Divya Bonagiri)
గానం: దివ్య మాలిక (Divya Maalika )& హనుమంత్ యాదవ్ (Hanumanth Yadav)
తారాగణం: అక్షిత్ మార్వెల్ (Akshith Marvel), రీను స్క్ (Reenu sk ) & వణ్య అగర్వాల్ ( Vaanya Agarwal)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.