Home » యత్ర నార్యస్తు (Yatra Naryasthu) సాంగ్ లిరిక్స్, పరదా (Paradha)

యత్ర నార్యస్తు (Yatra Naryasthu) సాంగ్ లిరిక్స్, పరదా (Paradha)

by Lakshmi Guradasi
1.8K views
Yatra Naryasthu song lyrics Paradha

యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా:
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా: క్రియా:

యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా:
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా: క్రియా:

మగువే మగువే ఆకాశంలో సగం
మగువే మగువే హిమవన్నగం
మగువే మగువే ఓ ప్రేమ సాగరం
మగువే మగువే ఇలకే వరం

మానవ జాతికి పురుడు పోసిన బ్రహ్మ రా.. ప్రణమిల్లారా
అమృతమూర్తిగా అవతరించిన అమ్మరా.. అపరంజిరా

యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా:
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా: క్రియా:

వశంకరి గౌరీ.. మహేశ్వరి మారి
జగానికే నీవు జనని
జనించని నీలా ప్రతి ఒక నారి
జయించదా నేడి అవని

నీ తొలి అంశగా పుట్టిన స్త్రీకి సర్వం నీవే శర్వాణి
అమ్మవు నువ్వై అక్కున చేర్చి కాచే కళ్యాణి
నెత్తురు తాగే మహిషాసురుని కుత్తుక తెంచిన రుద్రాణి
భయమిక నీకే బలియైపోనీ భం భం భవహారిణి

యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా:
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా: క్రియా:

ధరిత్రి లో సాగే చరిత్రనే చూడు బలైదినాళ్ళు మగువే
ప్రగాళ్ళ కాలంలో సవాళ్లకే కుంగి నశించనికే నీ తెగువే

వందల సీతలు పుడుతువున్నా నిందలు మోయక తప్పదుగా
న్యాయం కళ్ళకు గంతలు కడితే నాతికి నరకమేగా
కీచక మూకల గుండెలు చీల్చే కత్తులు కాని నీ వేళ్ళే
సైంధవ కూటమి కోటలు కూల్చేయ్ జంజానీలమల్లే

మగువే మగువే ఆకాశంలో సగం
మగువే మగువే హిమవన్నగం
మగువే మగువే ఓ ప్రేమ సాగరం
మగువే మగువే ఇలకే వరం

మానవ జాతికి పురుడు పోసిన బ్రహ్మ రా.. ప్రణమిల్లారా
అమృతమూర్తిగా అవతరించిన అమ్మరా.. అపరంజిరా

యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా:
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా: క్రియా:

___________

Song Credits:

చిత్రం – పరదా (Paradha)
పాట – యత్ర నార్యస్తు (Yatra Naryasthu)
సంగీతం: గోపీ సుందర్ (Gopi Sundar)
సాహిత్యం: వనమాలి (Vanamali)
గాయకులు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
నటీనటులు: అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), దర్శన రాజేంద్రన్ (Darshana Rajendran), సంగీత (Sangitha) తదితరులు.
దర్శకుడు: ప్రవీణ్ కాండ్రేగుల (Praveen Kandregula)

ఈ పాట ను కూడా చూడండి: Maa Andhaala Siri song lyrics Paradha

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.