కర్ణాటకల లోని ఉత్తర కర్ణాటక లో గోకర్ణ కి 48KM దూరంలో యాన కేవ్స్ ఉన్నాయి. కర్ణాటక లోనే ఈ యాన కేవ్స్ ఎత్తయిన గుహలు. ఇవి చూడటానికి చాల అందంగా ఉంటాయి. చుట్టూరు పచ్చని ప్రకృతి అందాలతో చూడటానికి ఎంతో అందంగా ఉండే ఈ ప్రదేశం కి మన పురాణాలలో కూడా గుర్తింపు ఉంది. యాన కేవ్స్ కు మీ స్నేహితులతో కలిసి వస్తే చాల బాగా ఆనందించవచ్చు. ఈ ప్రదేశం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం రండి.
యాన గుహల చరిత్ర:
పూర్వం ఈ ప్రదేశం లో భస్మాసురుడు అనే రాక్షుడు ఉండేవాడు. అతను శివుడి అనుగ్రహం కోసం ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తుండగా ఒకరోజు శివుడి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శివుడు నీకు ఏం కావాలి అని భస్మాసురుడుని అడగగా అతను ఒక స్వార్ధపూరితమైన కోరికను కోరుతాడు. ఆ కోరిక ఏమిటి అంటే అతను ఎవరి తల మీద అయితే చేయి పెడతాడో ఆ వ్యక్తి భస్మం అయిపోవాలి అని కోరుకుంటాడు.
ఇక శివయ్య గురించి మన అందరికి తెలిసిందే ఇచ్చిన మాట కోసం అతనికి ఆ వరం ను ఇస్తాడు. ఇక అప్పుడు ఆ భస్మాసురుడు శివుడి ఇచ్చిన వరం నిజంగా పని చేస్తుందా లేదా అని శివుడి మీదనే ప్రయత్నించబోతాడు. ఇక శివుడు భయం తో వైకుంఠం లో ఉన్న విష్ణువు దగ్గరికి వెళ్తాడు.
విష్ణువుకి జరిగిన విషయం అంత వివరిస్తాడు శివుడు. అప్పుడు విష్ణువు మోహిని అవతారం లో భస్మాసురుడి దగ్గరకి వచ్చి అతన్ని అందంతో కొంచెం మొహం కలిగేలా చేస్తాడు మోహిని అవతారం లో ఉన్న విష్ణువు. మోహిని ని వివాహం చేసుకోవాలి అంటే భస్మాసురుడు తనతో కలిసి నాట్యం చేయాలి అని షరతు పెడతాడు.
ఇక భస్మాసురుడు మోహిని కలిసి నాట్యం చేస్తూ ఉంటారు ఆ నాట్యం చేసే సమయం లో భస్మాసురుడు అతని తల మీద అతనే చేయి పెట్టుకుంటాడు ఇక అతను అదే చోట భస్మం అయిపోయి పడిపోతాడు ఆ భస్మం పడిన ఈ ప్రదేశమే యన కేవ్స్ గా మారింది. ఈ గుహలలో భస్మాసురుడి భస్మం ఇంకా పొడి లా రాలి పడుతూ ఉంటుంది అందుకనే దీనిని విభూతి ఫాల్స్ అని కూడా పిలుస్తారు.
యాన గుహలకు చేరుకోవడం ఎలా?
గోకర్ణ నుంచి యాన కేవ్స్ వెళ్ళడానికి గంట ప్రయాణం చేయాల్సి ఉంటుంది. గోకర్ణ నుంచి యాన కేవ్స్ కు చేరడానికి మీరు క్యాబ్ లేదా కార్ లో వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు క్యాబ్ లో వెళ్ళేపని అయితే 1300 నుంచి 1600 వరకు చార్జీలు ఉంటాయి.
యాన కేవ్స్ కు చేరుకున్నాక:
ఈ ప్రాంతానికి చేరుకున్నాక ఆ యాన గుహలకు చేరుకోవడానికి మీరు 2km ల ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కిలో మీటర్ల ప్రయాణం మీకు ఎంతో అద్భుతమైన అనుభూతుని ఇస్తుంది. దారిలో మీకు చిన్న చిన్న జలపాతాలు, పచ్చని చెట్లు, ఇలా చూడటానికి ఎంతో ప్రశాంతమైన అనుభూతుని ఇస్తుంది. ఇంకా ఈ ప్రదేశం లో ప్లాస్టిక్ ను నిషేదించారు.
ఈ ట్రెక్కింగ్ లో కొంత దూరం నడిచే మార్గం ఉంటె ఒక దగ్గర నుంచి 350 మెట్లు ఉన్నాయి. ఈ ట్రెక్కింగ్ దారిలో మీకు మోహిని పర్వతం(90 m) కనిపిస్తుంది. ఇక ట్రెక్కింగ్ చివరికి వచ్చేసరికి యాన గుహలను చేరుకుంటారు. ఈ యాన కేవ్స్ నే భస్మాసుర పర్వతం అంటారు, ఈ కొండా 120m ఎత్తు ఉంటుంది. ఈ కొండా గుహ లోపలికి వెళ్తే చుట్టూరు నల్ల రాయి తో ఉన్న పర్వతం ఉంటుంది పైన మాత్రం ఓపెన్ గా ఉంటుంది వ్యూ అయితే అదిరిపోతుంది.
ఈ గుహలో శివుడి లింగం కూడా ఉంటుంది. ఇక్కడ శనివారం, ఆదివారం అప్పుడు ఎక్కువ టూరిస్టులు ఉంటారు కొంచెం రద్దీ గానే ఉంటుంది. యాన కేవ్స్ కచ్చితంగా అందరు చూడాల్సిన ప్ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం చాల బాగా నచ్చుతుంది.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ విహారి ని సందర్శించండి.