డుమ్ డుమారే డుమ్ డుమారే పిల్ల పెళ్ళి చాంగుభళారే భళారే
జంజమారే జంజమారే శివుడు పెళ్ళి చాంగు భళారే భళారే
ఆళ్‌గర్ పిరుమాడ్లు అందాల చెల్లెలా మిల మిలలాడే మీనాక్షి
నీకంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారని ఈ రాత్రి
చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టెయ్యరా
చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టెయ్యరా
తందనాలా తారలతో గండాలు మాకు తప్పించారా
ఈ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా
కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంతా
డుమ్ డుమారే డుమ్ డుమారే పిల్ల పెళ్ళి చాంగుభళారే భళారే
జంజమారే జంజమారే శివుడు పెళ్ళి చాంగు భళారే భళారే
మధురా వురికే రా చిలకా రావేనులే
పెళ్ళి పందిళ్ళలో ముగ్గేసినా పన్నీటి ముత్యాలెన్నో
కనుచేపలకు నిదురంటూ రారాదని
కరగెంటానులే ఆడానులే గంగమ్మ నాట్యాలెన్నో
భువిలో కోలాటం గుండెలో ఆరాటం
యెదలో మొదలాయే పోరాటమే
ఆళ్‌గర్ పిరుమాడ్లు అందాల చెల్లెలా మిల మిలలాడే మీనాక్షి
నీకంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారని ఈ రాత్రి
అతి సుందరుడే సోదరుడే తోడు ఉండగా తల్లి ఈ కాపురం
శ్రీ గోపురం తాకాలి నీలాకాశం
నా పేగుముడి ప్రేమగుడి నా తల్లివే
నువ్వు నా అండగా నాకుండగా కంపించి పోదా కైలాసం
ఇప్పుడే శుభ లగ్నం ఇది నా సంకల్పం
విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా
ఆళ్‌గర్ పిరుమాడ్లు అందాల చెల్లెలా మిల మిలలాడే మీనాక్షి
నీకంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారని ఈ రాత్రి
చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టెయ్యరా
చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టెయ్యరా
తందనాలా తారలతో గండాలు మాకు తప్పించారా
ఈ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా
కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంతా
———————-
చిత్రం: అర్జున్ (Arjun)
సాహిత్యం: వేటూరి (Veturi)
సంగీతం: మణిశర్మ (Manisharma)
గాయకులు: S P బాలు (S P Balu), చిత్ర (Chitra)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.