Home » వింటున్నా ఓ పిల్ల (Vintunna O Pilla) Folk సాంగ్ లిరిక్స్ | Bullet Bandi Laxman

వింటున్నా ఓ పిల్ల (Vintunna O Pilla) Folk సాంగ్ లిరిక్స్ | Bullet Bandi Laxman

by Lakshmi Guradasi
0 comments
Vintunna O Pilla Folk song lyrics Bullet Bandi Laxman

లేవే నువ్వు నిద్దురా ఓ పిల్ల ఓ ఊర్మిలా
వనవాసం గెలిచి లచ్చమయోచ్చినాడిలా
ఎన్నేళ్ళ నిద్దురా తీరిందే నీ కల
మంచి నీళ్ళుద్దురా ఎదురుండే నీ దొర
ఎదురు చూపులకు ఎర్రగైనవి కళ్ళు
ఎదబారాలకు బక్కదైనది ఒళ్ళు
కడిగినవి కన్నీటితో తన పాదాలు
చేతి కందియు పళ్ళు

వింటున్నా ఓ పిల్ల ఎనెన్ని బాధల్లా
పడ్డంకా ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా
వింటున్నా ఓ బావ ఎన్నెన్ని దుఃఖాలే
దిగమింగి ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా

కోపమొచ్చి మాటలంటనే
చేయిలేపి దెప్ప కొడతనే
అలిగి నువ్వు ఫోను చేద్దూవమ్మా తెల్లారి నువ్వే

కొట్టినా నువ్వే కదనే
తిట్టినా నువ్వే కదనే
కందినా నా మనసుకు మల్ల మందు నువ్వేనే

మన బాధలన్నీ రాయవోతే పల్లవి
కన్నీల్లే రాసుకున్నవి చరణాలవి
కన్నిలేందుకే ఓ పిల్ల పల్లవి
ఈ లచ్చుమయ్య గుండెలుపిరున్నది

నా మనసులోని మాట నీకెట్టా సెప్పాలంటూ
మోమాటంతో నలుగుతూ ఉన్న వేళలో
నీ సిగ్గుపాడుగాను సిన్నబోయి బోయి నేను
చెప్పేశా దూరమైతావాని మనసుల మాట

అమావాస్య చీకట్లో చందమామలా..
తెచ్చావే నా బతుకుల దీపాల పండుగా
ఒడి అలిసిన నా గుండెకు గెలుపంటే నువ్వేగా

ఆ సంబురాన్నే రాయవోతే పల్లవి
మన సంతోషాలే రాసేనే చరణాలవి
నీకు కన్నిలేందుకే ఓ పిల్ల పల్లవి
ఈ లచ్చుమయ్య గుండెలుపిరున్నది

ఇచ్ఛ నీకో మాట అందరోప్పుకున్నోనైత
పది మంది మెచ్చేలా మెల్లోన పుస్తెను గడుతా
నిలబెట్టుకున్న మాట మెచ్చుకునేలా ఊరంతా
సాదించానయ్యా చదువుతోనే కొలువును నేనే

నా సిన్న సిన్న తప్పులను మన్నించినావే
నా పెద్ద పెద్ద ఆశలను గెలిపించినావే
వెన్ను పూసై నా వెనకనున్నవే..

నీ త్యాగాలనే రాయవోతే పల్లవి
మారిన నా రాతనే చరణాలవి
కన్నిలేందుకే ఓ పిల్ల పల్లవి
ఈ లచ్చుమయ్య గుండెలుపిరున్నది

రాజును నేను గానే కోటలు నాకు లేవే
నాకున్నంతలో మారాణోలే నిన్ను చూస్తానే
కోటలు మేడలేంది నీ నీడలంటే చాలే
నిన్ను పూస్తే మెట్టల పెట్టుకొని మురిసిపోతనే

మన ఆశలన్నీ అక్షింతలయెనే
ఆనందాలే నా కళ్ళలో నీళ్లై జారెనే
ఎదురు చూపులు ఇన్నాళ్లకు పెళ్లి చూపులాయెనే

నీ మెళ్ళో పూస్తే గడుతావుంటే పల్లవి
నా జల్లో పూలె పూలదండలైనవి
నీతో ఏడడుగులు వేస్తా ఉంటే పల్లవి
చూసి ముల్లోకాలే మురిసిపోయినవి

క్రెడిట్స్:
దర్శకుడు:
బుల్లెట్ బండి లక్ష్మణ్ (Bullet Bandi Laxman)
సంగీతం : మదీన్ Sk (Madeen Sk)
సాహిత్యం: లక్ష్మణ్ (Laxman)
గాయకులు : సుమన్ బదనకల్ (Suman Badanakal) & శ్రీనిధి (Srinidhi)
నటీనటులు : అక్షిత్ మార్వెల్ (Akshith Marvel) & శ్రీ రావులా చార్రి (Sri Ravula Charry)
నిర్మాత: పల్లవి (Pallavi) – లక్ష్మణ్ (Laxman)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.