వానే వానే దూకే వానే
నిన్నే చూసే చేయ్యే చాచే
పువ్వే పువ్వే రోజా పువ్వే
పేరే వింటే గంధం వీచే
ఈ గాలులే……ఏ..
చిన్ని చిన్ని పాదం మోపే
రాకే నీదా మా భూమికే
మన్నే దాచే ముత్యం నీవే
చేరవులే నా చేతికే
నీ బాటలో… నీ మాటలో…
పొంగే నువ్ రాగ సుధే
పూ తోటలో… నీ వాసనే
వీచేటి గాలులులివే
తేనూరే సిరి నీవే..
ఆటాడే నగవే
దూకే చల్లని మేఘం నీవా
సాగే గీతంలా….
ఆఆ ఆ.. విన్నె నీవేనా
ఈ రాగం నీ వల్లో
తీరం చేరే ఊహే నాలో
మాయే చేసెనే
ఆఆ ఆ.. కాలం వచ్చేలే
నీ తోడు నీడల్లో
నింగిన వేచే సశిముఖి నివే
నిండుగా కాచే వెలుతురునే
జ్ఞాపకమే కాదా… ముల్లో
నాటకమే చాలు
మారేదంటూ చోటే లేదే
గురుతులేవేరంటా చెరిగినవే దారంతా
ఆగేపోవు ఆగేపోవు కంటి చూపు కూడా
నీతో మాటే ఆపేనా
కంట్లో నీరడిగే ఒంట్లో దాహం తీరేదా
వానే వానే దూకే వానే
నిన్నే చూసే చేయ్యే చాచే
పువ్వే పువ్వే రోజా పువ్వే
పేరే వింటే గంధం వీచే
________________________________
పాట: వానే వానే (Vaane Vaane)
గాయకుడు: భరత్ సజికుమార్ (Bharath Sajikumar)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
సంగీతం: G. V. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)
నటీనటులు: శివకార్తికేయన్ (Sivakarthikeyan), సాయి పల్లవి (Sai Pallavi)
రచన & దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.