ఒక ఊరిలో చెరువు ఉంది . ఆ చెరువులో చాలా తాబేళ్లు ఉన్నాయి. వాటిలో ఒకటి చాలా మంచిది. ఇతరులకు సహాయం చేస్తూ.. అందరినీ మంచిగా పలకరిస్తూ ఉంటుంది. రెండో తాబేలుకు చాలా గర్వం. ఎవరితోను మాట్లాడేది కాదు, ఎప్పుడు ఎవరోకరితో గొడవపడుతూ ఉంటుంది. ఒక రోజు చేరువు కట్టెమీదకు వెళ్లగా… అక్కడ కనిపించిన మరో తాబేలు తిరగబడింది. ఎంత ప్రయత్నించినా సరిగా నిలబడలేకపోయింది. తాబేలు కష్టాన్ని గమనించిన కాకి.. చెరువులో చేపలకు ఈ విషయన్ని చెప్పింది. కానీ తాబేలు విషయం తెలిసిన మిగతా చేపలు, జీవులు దానికి సహాయం చేయడానికి నిరాకరించాయి. చాలా సేపటి వరకు కష్టాపడిన తాబేలు తన జీవితం ముగిసిందని చింతించింది. రెండో తాబేలు ఎప్పటికి చెరువులోకి రాకపోవడం గమనించిన మొదటి తాబేలు… ఏమైంది అని కత్తిమీదకు వెళ్లి చూసింది. తిరగబడి ఉన్న తాబేలును నిలబెట్టింది. ఏమైందని ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పింది. ఇంకెప్పుడు ఎవరితోనూ గొడవపడనని, బుద్ధి వచ్చిందని క్షమాపణ చెప్పింది. అప్పటి నుంచి అందరితోనూ స్నేహంగా ఉంటుంది.
నీతి: ఇతరులతో మంచిగా ఉన్నప్పుడే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా చేస్తారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలు ను చూడండి.