Home » ఇంట్లోనే నల్లమచ్చలు తగ్గించే చిట్కాలు

ఇంట్లోనే నల్లమచ్చలు తగ్గించే చిట్కాలు

by Rahila SK
0 comment

ముఖంపై నల్లమచ్చలు చాల ఇబ్బందిగా అనిపిస్తాయి. మొటిమలు గిల్లినా కూడా మచ్చలు ఏర్పడి సమస్యగా మారుతాయి. ఇంట్లోనే నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటించడం మంచిది. అవేంటోతెలుసుకుందాం.

  1. బటర్ మిల్క్, బటర్మిల్క్ లో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై మృతకణాల్నితొలగిచి స్కిన్ కు కొత్త మెరుపును అందిస్తుంది నల్ల మచ్చల్ని సులువుగా నివారిస్తుంది.
  2. తేనె, చర్మంపైన నల్లమచ్చల్ని తొలగించడంలో తేనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే చర్మంన్ని మృదువుగా మార్చి కాంతివంతం చేస్తుంది.
  3. టొమాటో, టొమాటోల్లో విటమిన్ “సి” మరియు “కె” తో పాటు లైకోపీన్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది నల్లమచ్చల్ని తొలగించడంలో సహాయపడుతుంది.
  4. అలోవెరా జెల్, అలొవెరాతో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పొందవచ్చు. అలోవేరాలోని పోషకాలు చర్మంపైన నల్ల మచ్చల్ని తొలగించి కాంతివంతంగా మరుస్తాయి.
  5. బొప్పాయి, బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది. ఇది నల్ల మచ్చల్నితొలగించి చర్మన్ని కాంతివంతంగా మార్చడంలో సహమపడుతుంది.
  6. స్ట్రాబెర్రీ, స్ట్రాబెర్రీలో యాంటీఆక్సిడెంట్లు విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మం మంట, వాపును తగ్గించడంతో పాటు నల్ల మచ్చల్ని తొలగించడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి.
  7. నిమ్మకాయ, నిమ్మరసంలో విటమిన్ “సి” తో పాటు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ సౌదర్యాన్ని రక్షిస్తాయి. అలాగే మొటిమలు రాకుండా చూస్తాయి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment