తొలి తొలిగా తొలకరి (Tholi Tholiga Tholakari) సాంగ్ లిరిక్స్, Abhimanyudu

by Lakshmi Guradasi

తొలి తొలిగా తొలకరి చూసిన పిల్లాన్నై
విప్పారిన కన్నుల్తో లోకాన్నే చూశా
ఇది వరకెప్పుడు తెలియని ఈ మాధుర్యం
ఇప్పుడిప్పుడీ సమయాన నీ వల్లనే చూశా

ఓ వట్టి మట్టి కుండీ ప్రతి రోజు చూస్తువున్నా
అది చక్కని పూవులనెన్నోఇస్తుందని నేడే చూశా
హృదయంతో స్నేహం చేసే కళ్ళే మనకోసం నిలిచే
పాదం మన భుజమే తట్టే చెయ్యి

ఎంతో ఎంతో అర్థం చూపించగా
ఎంతెంతో ఆనందం పొందానుగా
నీడల్లోని శిల్పం మెరిసాకిలా
తీపి కంటి నీరు కురిసేనుగా

ఉప్పొంగే నడి సంద్రాన
ఆల్చిప్పను నే కనుగొన్న
లోలోపల ముత్యం ఉందని
సత్యాన్నే తెలుసుకున్న
అందంలో అందమే కాదు కదా
అందంలో అర్థము ఉంది కదా

తొలి తొలిగా తొలకరి చూసిన పిల్లాన్నై
విప్పారిన కన్నుల్తో లోకాన్నే చూశా
ఇది వరకెప్పుడు తెలియని ఈ మాధుర్యం
ఇప్పుడిప్పుడీ సమయాన నీ వల్లనే చూశా

ఈ జన్మకే కారణం ఏమిటంటు
తెలుసుకుంటు సాగనా నేనే ఇక
మార్చవేల ఇలా?

నా కోపము తాపము మాయం చేసి నువ్విలాగా
గుండెలోన ప్రేమ నీరు పోసినవీలా
అలజడుల ఉప్పెనవు నా జీవితన్నిలా
ఓ చల్లని గాలిలా నీ స్నేహం చేరిలా

ఎంతో ఎంతో అర్థం చూపించగా
ఎంతెంతో ఆనందం పొందానుగా
నీడల్లోని శిల్పం మెరిసాకిలా
తీపి కంటి నీరు కురిసేనుగా

ఉప్పొంగే నడి సంద్రాన
ఆల్చిప్పను నే కనుగొన్న
లోలోపల ముత్యం ఉందని
సత్యాన్ని తెలుసుకున్న
అందంలో అందమే కాదు కదా
అందంలో అర్థము ఉంది కదా

తొలి తొలిగా తొలకరి చూసిన పిల్లాన్నై
విప్పారిన కన్నుల్తో లోకాన్నే చూశా
ఇది వరకెప్పుడు తెలియని ఈ మాధుర్యం
ఇప్పుడిప్పుడీ సమయాన నీ వల్లనే చూశా

______________

పాట: తొలి తొలిగా తొలకరి (Tholi Tholiga Tholakari)
చిత్రం: అభిమన్యుడు (Abhimanyudu)
గాయకులు: జితిన్ రాజ్ (Jithin Raj)
సాహిత్యం: శ్రేష్ట (Sreshta)
నటించినవారు: విశాల్ (Vishal), అర్జున్ (Arjun), సమంత (Samantha)
దర్శకత్వం: పి.ఎస్. మిత్రన్ (P. S. Mithran)
సంగీతం: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like