తిప్పుకుంటాన్నావ్ (Thippukuntannav) సాంగ్ లిరిక్స్ | బ్యాండ్ మేళం (Band Melam)

by Lakshmi Guradasi

బల్లెం చుట్టూ ఈగ లెక్క…
మంచం చుట్టూ దోమ లెక్క…

బల్లెం చుట్టూ ఈగ లెక్క
మంచం చుట్టూ దోమ లెక్క
గుడి చుట్టూ భక్తుని లెక్క
బారు చుట్టూ తాగుబోతు లెక్క..
తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నవ్

యహే తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పేస్కుంటనావ్

పచ్చని లంగా చుట్టి ఎరెర్రనీ వోణి ఏసి
చెవులకు కమ్మలు పెట్టి అరె కాళ్లకు పట్టిలు కట్టి

పచ్చని లంగా చుట్టి ఎరెర్రనీ వోణి ఏసి
చెవులకు కమ్మలు పెట్టి అరె కాళ్లకు పట్టిలు కట్టి
అరె కొబ్బరికాయ బుట్ట పట్టుకొని కోవెలకే నువ్ పోతూ
నా తలకాయలా గత్తర లేపి గాబరా నన్నే చేస్తూ

సూర్యుని చుట్టూ భూమి లెక్క
పైసల చుట్టూ మనుషుల లెక్క
తిప్పు అరె తిప్పు అబ్బా తిప్పుకుంటాన్నవ్.. తిప్పు తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నవ్
అరె తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ వెనక తిప్పు తిప్పేస్కుంటనావ్

కళ్ళే ఎగిరేస్తుంటావ్, ఇంతలో పళ్లే నూరుతూ ఉంటావ్
అల్లరి చేస్తూ ఉంటావ్, అంతలో చల్లని మాటలు చెబుతావ్

కళ్ళే ఎగిరేస్తుంటావ్, ఇంతలో పళ్లే నూరుతూ ఉంటావ్
అల్లరి చేస్తూ ఉంటావ్, అంతలో చల్లని మాటలు చెబుతావ్
అందరి కంటే చిన్న ముల్లిలా అలిగి నువ్ కూసుంటావ్
సందే దొరికితే పెద్ద మనిషిలా పెత్తనమే చేస్తుంటావ్

ఎన్నో ఎన్నో ఏషాలేసి దీపం చుట్టూ పురుగును చేసి
తిప్పు.. ఏం తిప్పుతున్నవే ?
తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నవ్
యే తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పు తిప్పేస్కుంటనావ్

కోడి చుట్టూ గద్ద లెక్క
చంద్రుని పట్టిన గ్రహణం లెక్క
ఓయ్ కోడి చుట్టూ గద్ద లెక్క
చంద్రుని పట్టిన గ్రహణం లెక్క
పంటల్లో తెగులు లెక్క
తగులుకోకు నువ్ నా ఎనక
ఇడిసి పెట్టేసేయ్.. ఇడిసి పెట్టేసేయ్
నా యెంట పడక ఇడిసి ఇడిసి పెట్టేసేయ్
పెట్టేసేయ్.. ఇడిసి పెట్టేసేయ్
నన్నే నా మానాన ఇడిసి పెడితే పోతానోయ్

In English Version:

Ballem chuttuu eega lekka…
Mancham chuttuu doma lekka…

Ballem chuttuu eega lekka
Mancham chuttuu doma lekka
Gudi chuttuu bhaktuni lekka
Baaru chuttuu taagubothu lekka..
Tippukuntannav… tippukuntannav
Nanne nee chuttuu tippu tippukuntannav

Yahe tippukuntannav… tippukuntannav
Nanne nee chuttuu tippu tippesukuntanav

Pachchani langa chutti ererrani voni esi
Chevulaku kammalu petti are kaallaku pattilu katti

Pachchani langa chutti ererrani voni esi
Chevulaku kammalu petti are kaallaku pattilu katti
Are kobbarikaaya butta pattukoni kovelake nuv pothu
Naa talakaayalaa gattara lepi gaabara nanne chesthu

Suryuni chuttuu bhoomi lekka
Paisala chuttuu manushula lekka
Tippu are tippu abbaa tippukuntannav… tippu tippukuntannav
Nanne nee chuttuu tippu tippukuntannav
Are tippukuntannav… tippukuntannav
Nanne nee venaka tippu tippesukuntanav

Kalle egirestuntaav, inthalo palle nooruthu untaav
Allari chesthu untaav, anthalo challani maatlu chebutaav

Kalle egirestuntaav, inthalo palle nooruthu untaav
Allari chesthu untaav, anthalo challani maatlu chebutaav
Andari kante chinna mullilaa aligi nuv koosuntaav
Sande dorikithe pedda manishilaa peththaname chestuntaav

Enno enno eshaalesi deepam chuttuu purugunu chesi
Tippu… em tippunnave?
Tippukuntannav… tippukuntannav
Nanne nee chuttuu tippu tippukuntannav
Ye tippukuntannav… tippukuntannav
Nanne nee chuttuu tippu tippu tippesukuntanav

Kodi chuttuu gadda lekka
Chandruni pattina grahanam lekka
Oy kodi chuttuu gadda lekka
Chandruni pattina grahanam lekka
Pantallo tegulu lekka
Tagulukoku nuv naa enaka
Idisi pettesey… idisi pettesey
Naa yenta padaka idisi idisi pettesey
Pettesey… idisi pettesey
Nanne naa maanaana idisi pedite pothaanoy.

____________________

Song Credits:

పాట పేరు: తిప్పుకుంటాన్నావ్ (Thippukuntannav)
చిత్రం: బ్యాండ్ మేళం (Band Melam)
లిరిక్స్ & ట్యూన్: చంద్రబోస్ (Chandrabose)
గాయకులు: రాము రాథోడ్ (Ramu Rathod) & అదితి భావరాజు (Aditi Bhavaraju)
సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin)
నటీనటులు: హర్ష్ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi), సాయి కుమార్ (Sai Kumar) & ఇతరులు.
రచయిత & దర్శకుడు: సతీష్ జవ్వాజి (Sathish Javvaji)

See Also plz click on this: premalo-song-lyrics-court-harsh-roshan

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like