హరికేన్ కారణంగా బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన భారత జట్టు మరికొన్ని గంటల్లో స్వదేశానికి బయలుదేరనుంది. ఆటగాళ్లు, సిబ్బంది కోసం BCCI ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. వీరితో 20మందికిపైగా మీడియా సిబ్బంది వచ్చేందుకు BCCI సెక్రటరీ జైషా అనుమతించారని చెప్పారు. ఈ క్రమంలో మీడియా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా రేపు ఉదయం కల్లా విమానం ఢిల్లీ చేరే అవకాశముంది.
T20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత బార్బడోస్‌లోనే చిక్కుకున్న భారత క్రికెట్ జట్టును స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానాన్ని బీసీసీఐ ఏర్పాటు చేసింది. బార్బడోస్ ఎయిర్‌పోర్టు చేరుకున్న ఈ స్పెషల్ విమానంలో భారత్ టీమ్ స్వదేశానికి పయనమైంది.
రేపు ఉదయం 6 గంటలకు ఢిల్లీ చేరుకోనుంది. గ్రాంట్లీ ఆడమ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇంత భారీ విమానం ల్యాండ్ అవడం ఇదే తొలిసారని అక్కడి సిబ్బంది చెబుతున్నారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ క్రీడలు సందర్శించండి.