నేటి కాలం లో పిల్లలు పుట్టినప్పటి నుంచి డైపర్లను వాడటం ఒక సాధారణం అయిపోయింది. తరచూ పిల్లలకు డైపర్లను వాడటం వల్ల వాళ్లకు రషెస్ లేదా స్కిన్ అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలా రాషెస్ రాకుండా ఉండాలి అంతే ఎల్టి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం రండి.
మూడు గంటలకు మించి ఒకే డైపర్ వేసి ఉండకండి. తరచు మారుస్తూ ఉండండి.
డైపర్ ను తీసేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత మెత్తటి కాటన్ టవల్ ను తీసుకొని తుడిచి కొంచెం సేపు అలా వదిలేసిన తర్వాత కొత్త డైపర్ ను వేయండి.
అనవసరమైన అప్పుడు డైపర్ ను వేయకండి. బయటి కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేటప్పుడు డైపర్ ను వాడకండి.
డైపర్ ను వేసిన తర్వాత అలా వదిలేయకుండా తరచు డైపర్ పొడి గా ఉందా తడి గా ఉందా అని చెక్ చేస్తూ ఉండండి.
కుదిరినప్పుడు బేబీ కి ఆసనం దగ్గర కొబ్బరి నూనె లేదా బాదం నూనె లేకపోతే ఏమైనా కెమికల్స్ తక్కువ ఉండే క్రీమ్ లను రాయండి.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.