వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియన్ ఛాంపియన్స్ శుభారంభం చేశారు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ ఛాంపియన్స్ తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఇయాన్ బెల్ 59, పటేల్ 51 హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ 2 వికెట్లు, కులకర్ణి, ఆర్.పి.సింగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
తర్వాత చేజింగ్ కు దిగిన ఇండియా 166 పరుగులు లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే చేదించింది. ఇండియా బ్యాటర్లలో రాబిన్ ఊతప్ప 32 బంతుల్లో 50 పరుగులు 4 ఫోర్లు, 2 సిక్సులతో టాప్ స్కోరర్. అలాగే గురుక్రిత్ సింగ్ 33 నమన్ ఓజా 25 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్కోఫీల్డ్ 4 వికెట్లు పడగొట్టగా రవి బపోరా 2 వికెట్లు సాధించారు. ఒకానొక దశలో భారత ప్రధాన బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అవ్వగా కేవలం 7 బాల్స్ లో 6 రన్స్ కావాల్సి ఉండగా 18 ఓవర్లో చివరి బాల్ కి హర్భజన్ సింగ్ సిక్స్ కొట్టి గెలిపించారు. ఈ మ్యాచ్ యొక్క హైలెట్స్ యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ క్రీడలు సందర్శించండి.