Home » శ్రీమంతుడా – శ్రీమంతుడు

శ్రీమంతుడా – శ్రీమంతుడు

by Firdous SK
0 comments

పాట: శ్రీమంతుడా
సినిమా: శ్రీమంతుడు
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
గాయకులు: ఎం ఎల్ ర్ కార్తికేయన్


ఓ నిండుభూమి నినురెండు చేతులతో
కౌగిలించమని పిలిచినదా
పిలుపు వినర మలుపుకనర
పరుగువై పదపదరా

గుండెదాటుకుని పండుడైనా
కల పసిడి దారులను తెరిచినదా
ఋణం తీర్చే తరుణమిదిరా
కిరణమై పదపరా

ఓ ఏమివదిలి ఎటుకదులుతోంది
మరి మాటకైనా మరి తలచినదా
మనిషితనమే నిజముతనమై
పరులకై పదపదరా

మరలి మరల వెనుతిరగనన్న
చిరు నవ్వే నీకు తోలి గెలుపుకదా
మనసు వెతికే మార్గమిదిరా
మంచికై పదపదరా

లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం
ప్రేమై వర్షించని నీ ప్రాణం
సాయం సమాజమే నీ ధ్యేయం నిరంతరం
కోరే ప్రపంచ సౌఖ్యం నీకుకాక ఎవరికీ సాధ్యం

విశ్వమంతటికి పేరు పేరునా
ప్రేమ పంచగల పసితనమా
ఎదురు చూస్తే ఎదను మీటే
పవనమై పదపదరా

లేనిదేదో పనిలేనిదేదో
విడమరిచి చూడగల ఋషిగుణమా
చిగురు మెలిసి చినుకుతడిగా
పయనమై పదపదరా

పోరా శ్రీమంతుడా
పోరా శ్రీమంతుడా
నీలో లక్ష్యానికి జై హోం

పోరా శ్రీమంతుడా
పోరా శ్రీమంతుడా
నీలో స్వప్నాలన్నీ
సాకారమవగా జై హోం జై హో

మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment