శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కల ఆహ్వానిస్తూ..
నీ కనులెటు చుస్తున్నాయే మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగారు బొమ్మ
శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కల ఆహ్వానిస్తూ…
నీ కనులెటు చుస్తున్నాయే మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగారు బొమ్మ
జల జల జల జాజుల వాన..కిల కిల కిల కిన్నెర వీణ..
మిలమిల మిన్నంచుల పైన మెలి తిరిగిన చంచాలయన
మధురోహల లాహిరిలోన మదినూపే మధిరవే జాణ
నీ నడకలు నీవేనా చూసావా ఏనాడైనా
నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాస్తయినా నీ వెనకాల ఏమౌతున్న..
నీ వీపుని ముల్లై గుచ్చి కునుకెరుగని చూపులు ఎన్నో..
లాస్యం పుట్టిన ఊరు…లావణ్యం పెట్టని పేరు
లలన తెలుసో లేదో నీకైనా నీ తీరు
నీ గాలి సోకిన వారు గాలిబ్ గజాలైపోతారు..
నీ వేలే తాకినవారు నిలువెల్లా వీణైపోతారు…
కవితవో యువతివో ఎవతివో గుర్తించేదెట్టాగమ్మా…
నక్షత్రాలేనంటూ లెక్కడితే ఏమైనట్టు..
నీ మనసుకు రెక్కలు కట్టు…చుక్కల్లో విహరించేట్టు..
ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ…
చిక్కటి చీకటినే చూస్తూ నిద్దురనే వెలివేయొద్దు..
వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు..
ఇదుగో వచ్చేనంటూ తక్షణమే హాజరయేట్టు…
అందక మారం మని జోకట్టేవే ఆరాటాన్ని..
పొందిగ్గా పడుకో రాణి జాగారం ఎందుగ్గాని…
నళినివో హరిణివో తరుణివో మురిపించే ముద్దులగుమ్మ
_____________________
Song Credits:
సాంగ్ | శ్రీకారం చుడుతున్నట్టు (Srikaram chudutunatu) |
చిత్రం | కుదిరితే కప్పు కాఫీ (Kudirithe kappu coffee) |
సంగీతం | యోగేశ్వర శర్మ (Yogeshwara Sharma) |
లిరిక్స్ | సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Sitaramasastri) |
గాయకులు | S. P. బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam), DJ నిహాల్ (DJ Nihal) |
నటీనటులు | వరుణ్ సందేశ్ (Varun Sandesh), సుమా భట్టాచార్య (Suma Bhattacharya) |
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.