తల్లేరా ఈ సేను సిలక
తవ్వేసే తన కడుపే ఆరక
రువ్వేసే ఓ విత్తనమింక ఏలేలో
నీళ్లన్నీ సాలల్లో అలుక
మొలిసేనే సిన్నారి మొలక
ఎదిగెనే సిరులన్నీ ఒలక ఏలేలో
మోసేనే తన ఒళ్ళో ఈ నల్ల రేగల్లో
ఎన్నెన్ని పొద్దుల్లో మునిమాపుల్లో..
కాసేనే కండ్లల్లో దాసేనే కొంగుల్లో
తెల్లని నవ్వుల్లో నవ మాసాల్లో..
రే రేలా రేలా రేలా పైరే ఉగేను ఉయ్యాల
ఈ సల్లగాలులు పాడే జోల పాటల్లా
రే రేలా రేలా రేలా ఎన్నెల ఎలుగులు సల్లేలా
తన మోమె మెరిసెనంట వెన్న ముద్దల్లా
బస్తాలలో ముస్తాబై కలకలలా ఈ పంట
బండి మీదికి చేరిందంతా మొగంగా గంట
సెమట సుక్కల జవాబై మిలమిలలా ఈ పంట
సంబురమేంతో తెచ్చిందంటా రైతన్న ఇంట
సల్లంగా సూతే కాలము పైలంరా రైతు ప్రాణము
సుట్టురా ఉన్న బలగము పొలమేనమ్మా…
రే రేలా రేలా రేలా పైరే ఉగేను ఉయ్యాల
ఈ సల్లగాలులు పాడే జోల పాటల్లా
రే రేలా రేలా రేలా ఎన్నెల ఎలుగులు సల్లేలా
తన మోమె మెరిసెనంట ఎన్న ముద్దల్లా..
___________________
Song Credits :
సాంగ్ | రే రేలా (Re Rela) |
సినిమా | బాపు (Baapu) |
గాయని | మధు ప్రియ (Madhu Priya) |
సంగీతం | RR ధ్రువన్ (RR Dhruvan) |
సాహిత్యం | కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) |
రచన మరియు దర్శకత్వం | దయ (Daya) |
నిర్మాత | రాజు (Raju), ch. భాను ప్రసాద్ రెడ్డి (ch. Bhanu prasad reddy) |
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.