వీడు మొరటోడు..
అని వాళ్లు వీళ్లు ఎన్నెన్ని అన్న
పసిపిల్ల వాడు నా వాడు
వీడు మొండోడు
అని ఊరువాడ అనుకున్నగానీ..
మహరాజు నాకు నా వాడు..
ఓ.. మాట పెళుసైనా..
మనుసులో వెన్నా..
రాయిలా ఉన్నవాడిలోన
దేవుడెవరికి తెలుసును నాకన్న
సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి..
మెత్తాని పత్తి పువ్వులామరి సంటోడే నా సామి..
ఓ… ఎర్రబడ్డా కళ్లలోనా..
కోపమే మీకు తెలుసు..
కళ్లలోన దాచుకున్న
చెమ్మ నాకే తెలుసు..
కోర మీసం రువ్వుతున్న
రోషమే మీకు తెలుసు..
మీసమెనక ముసురుకున్న
ముసినవ్వు నాకు తెలుసు..
అడవిలో పులిలా సర సర సర సర
చెలరేగడమే మీకు తెలుసు..
అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు
సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి..
మెత్తాని పత్తి పువ్వులామరి సంటోడే నా సామి..
ఓ.. గొప్ప గొప్ప ఇనాములనే..
ఇచ్చివేసే నవాబు..
నన్ను మాత్రం
చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు
పెద్ద పెద్ద పనులు ఇట్టే..
చక్కబెట్టే మగాడు..
వాడి చొక్క ఎక్కడుందో..
వెతకమంటాడు చూడు..
బయటకు వెళ్లి ఎందరెందరినో..
ఎదిరించేటి దొరగారు..
నేనే తనకీ ఎదురెళ్లకుండా..
బయటకు వెళ్లరు శ్రీవారు..
సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి..
ఇట్టాంటి మంచి మొగడుంటే.. ఏ పిల్లయినా మహరాణి..
______________________________
పాట: సూసేకి (Sooseki)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (DSP) (Devi Sri Prasad (DSP))
గాయని: శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
నటులు: అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక (Rashmika)
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్ బండ్రెడ్డి (Sukumar Bandreddi)
నిర్మాతలు: నవీన్ యెర్నేని (Naveen Yerneni), రవిశంకర్ యలమంచిలి (Ravi Shankar Yalamanchili)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.