శివయ్యా నీ మాయ తెలియదయ్య (Shivayya Nee Maaya) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

ఓ నమో శివాయ ఓ తండ్రి శివయ్యా
ఓం నమో శివాయ
ఓం నమో శివాయ ఒక్కసారి చూడవా
ఓం నమో శివయ
ఓం నమో శివాయ ఓ తండ్రి శివయ్యా
ఓం నమో శివాయ
ఓం నమో శివాయ ఒక్కసారి చూడవా

ప్రపంచాన్ని యేలేటి పరమేస్వరుడ నీవంటా …..
పలకవయ్య పరమేష ఓం నమో శివాయ (2 )
జగతినేల జన్మాదాత నీవంటా జంగమ
విచిత్రాల విధిరాతలు ఎట్ల రాసే ఆ బ్రహ్మ

శివయ్యా నీ మాయ తెలియదయ్య
శివయ్యా నీ మాయ గొప్పదయ్యా….( 2)
ఓం నమో శివయ్యా ఓ తండ్రి శివయ్యా
ఓ నమో శివాయ ఒక్కసారి చూడవా….

అణువణువు అంతటా నీవే అంటున్నరు
అగాయిత్తె ఎట్ల జరిగే ఓ లింగా రూపుడా
ఓ నమో శివాయ ఓ తండ్రి శివయ్యా
అందరని ఎలేటి అయ్యవు నీవంటా
అన్నదాత చావులును ఎందుకు ఆపుతాలేవు
ఓం నమో శివాయ ఓ తండ్రి శివయ్యా

శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంట
ఏ పాపం ఎరుగనోళ్ళ యముడేట్ల ప్రాణము తీసే
శివయ్యా నీ మాయ తెలియదయ్యా
శివయ్యా నీ మాయ గొప్పదయ్యా….( 2)
ఓం నమో శివయ ఓ తండ్రి శివయ్యా
ఓం నమో శివాయ ఒక్కసారి చూడవా

ఎదిగేవాడ్ని చూసి ఏడ్చే మనసేమో ఇచ్చినావు
ఆపదలో ఆదుకుని ఐనవాళ్ళని ఇచ్చినావు
ఓం నమో శివాయ ఓ తండ్రి శివయ్యా
అమ్మ అంటే ప్రాణం ఇచ్చే కొడుకుల సృష్టించినావు
ఆడపిల్ల పుడితే హత మార్చిటోళ్ల సృష్టించావ్
ఓం నమో శివాయ ఓ తండ్రి శివయ్యా
మణి అనే వస్తువుని మనిషి చేత సృష్టించావ్….
ఆ మణి తోనే ప్రజల పాములోలె ఆడిస్తావ్

శివయ్యా నీ మాయ తెలియదయ్యా
శివాయ్య నీ మాయ గోపదయ్యా…( 2)
ఓం నమో శివాయ ఓ తండ్రి శివయ్యా
ఓ నమో శివాయ ఒక్కసారి చూడవా..

అందరికి ఒక్కడే గుళ్లే దేవుడు అని అంటివి
ఆజ్ఞే నీ స్వేసలంటూ దర్శనాలు కలిగిస్తివి
ఓం నమో శివాయ ఓ తండ్రి శివయ్యా
పేద దనికి బేధము లేదు అని అంటివి
ఉండి డబ్బులు అన్ని చూసి ఉన్నవాడ్ని చేస్తివి
ఓం నమో శివాయ ఓ తండ్రి శివయ్యా
నరులను కాపాడేందుకు పాలకులను చేస్తివి
నరుల వోలె రక్తం తాగే రాక్షుసుల మారిస్తివి

శివయ్యా నీ మాయ తెలియదయ్య
శివయ్యా నీ మాయ గొప్పదయ్యా… ( 2)
ఓం నమో శివాయ ఓ తండ్రి శివయ్యా
ఓం నమో శివాయ ఒక్కసారి చూడవా….

పాపాత్ముల పుట్టించే ప్రాణదాత నీవంటా
పుణ్యాత్ముల ప్రాణాలు పుటుక్కున తీస్తువంట
ఓం నమో శివాయ ఓ తండ్రి శివయ్యా
విషం మింగి అమృతాన్ని దేవుళ్ళకు ఇస్తువంట….
విషం చిందే పాములను మా పై వదిలిస్తవంట
ఓం నమో శివాయ ఓ తండ్రి శివయ్యా
కోట్లు ఉన్నవానికే నోట్ల గుప్పలిస్తవంట
కూటికి నిండని వాళ్ళని ఆకలితో చంపుతావంట

శివయ్యా నీ మాయ తెలియదయ్య
శివయ్యా నీ మాయ గొప్పదయ్యా …( 2 )
ఓం నమో శివాయ ఒక్కసారి చూడవా…

See Also plz click on this: eshwara-parameshwara-song-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like