శెనిగ చేన్ల నిలబడి చేతులీయవే
సెందురాల కు బాల
చేతులీయవేసెందురాల కు బాల
చేతులియ నీతో నాకు చెల్లెలున్నారో
మయాదారి మల్లేష
చెల్లెలున్నారో మయాదారి మల్లేష
మరి సత్త సెను కాడ నువ్వు సైగ చెయ్యవే
సెందురాల కు బాల
సైగ చెయ్యవే సెందురాల కు బాల
సైగ చేసి చెంత కోస్తా ఏలు పట్టుకో
మాయదారి మల్లేష
తాళి కట్టుకో మాయదారి మల్లేష
పిల్ల మనువాడుత నిన్ను గాని మనసు కలపవే
సెందురాల కు బాల
మనసు కలపవే సెందురాల కు బాల
మనసు కలిపి మాటలాడి పయనమైతిరో
మాయదారి మల్లేష
పయనమైతిరో మాయదారి మల్లేష
మరి మనసు కలిపి మల్లె తోట కట్టి పోరాదే
సెందురాల కు బాల
ముద్దిచ్చి పోరాదే సెందురాల కు బాల
మల్లె తొట్లకొచ్చి పోతే ఏమిస్తావ్ రో
మాయదారి మల్లేష
ఏమిస్తావ్ రో మాయదారి మల్లేష
అరే కందిరీగ నడుము చూపి కన్ను కొడతావే
సెందురాల కు బాల
కన్ను కొడతావే సెందురాల కు బాల
కన్ను కొట్ట కౌగలించ కలవరిస్తిరో
మాయదారి మల్లేష
కదిలి వస్తిరో మాయదారి మల్లేష
మరి వాలుతున్న పొద్దులాగా వాలిపోరాదే
సెందురాల కు బాల
వాలిపోరాదే సెందురాల కు బాల
వాలిపోతే వాలిపోత వన్నెలు పైలం
మాయదారి మల్లేష
నా వన్నెలు పైలం మాయదారి మల్లేష
అబ్బబ్బా మట్టి పులా అందమంతా దాపును సాకే
సెందురాల కు బాల
దాపును సాకే సెందురాల కు బాల
కష్టమైతే కాపు కాసి అంటి పెట్టుకో
మాయదారి మల్లేష
నన్ను అంటి పెట్టుకో మాయదారి మల్లేష
ఛలో అంటి పెట్టుకుంటా గాని అల్లుకుబోవే
సెందురాల కు బాల
అల్లుకుబోవే సెందురాల కు బాల
అల్లుకుంటే అల్లుకుంటా గిల్లుకురాదో
మాయదారి మల్లేష
నన్ను గిల్లుకురాదో మాయదారి మల్లేష
మరి అన్ని కుదిరినాయి పిల్ల ఆగనలేనే
సెందురాల కు బాల
ఆగనలేనే సెందురాల కు బాల
అలగకుండా ఆగకుండా ఎత్తుకపోరా
మాయదారి మల్లేష
నన్ను ఎత్తుకపోరా మాయదారి మల్లేష
ఎన్నడు లేని సంతోషాలు ఎదల నిండుగా
సెందురాల కు బాల
ఎదల నిండుగా సెందురాల కు బాల
ఆలు మొగలమై కలిసిపోవాలా
నా బావ మల్లేష
మురిసిపోవాలా మేన బావ మల్లేష
కలిసిపోవాలా నా బావ మల్లేష
మురిసిపోవాలా మేన బావ మల్లేష బావ మల్లేష
____________________
నిర్మాత: సంతోష్ యాదవ్ (Santhosh Yadav)
సాహిత్యం : మానుకోట ప్రసాద్ (Manukota Prasad)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
గానం: అశ్విని (Ashwini), జోగుల వెంకటేష్ (Jogula Venkatesh)
తారాగణం : జానులిరి (Janulyri), రాజు (Raju)
కొరియోగ్రఫీ: శేఖర్ వైరస్ (Shekar Virus)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.