Home » సత్యభామ (Satyabhama) సాంగ్ లిరిక్స్ – Simharasi

సత్యభామ (Satyabhama) సాంగ్ లిరిక్స్ – Simharasi

by Lakshmi Guradasi
0 comments
Satyabhama song lyrics Simharasi

సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా..ఆ..
వేళకాని వేళల్లోనా పిలుపులేంటమ్మా..
సందమామ సందమామ సరసమాడయ్యా..ఆ..
నిన్ను చూసిన ఘడియనుండి నిదురలేదయ్యా..

పుత్తడి బొమ్మే నీవా
అందానికి అర్థం నీ..వా..
నచ్చినవాడివి లేరా..
నా ప్రాణమే నీవని తెలుసుకోరా

సత్యభామా …..
సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా..ఆ..
వేళకాని వేళల్లోనా పిలుపులేంటమ్మా..

కట్టుకున్న పచ్చచీరా..
బాగుందే చిలకమ్మా..

ఓహో… కట్టుకున్న పచ్చచీరా..
బాగుందే చిలకమ్మా..
ముట్టుకుంటే కట్టుజారి..
పోతుంది వినవయ్యా..

అరె వయ్యారి నారి ఓ కంట చేరి
మీదమీద పడతావే..ఏ..
అహా అల్లేసుకోరా గిల్లేసుకోరా
ఆకు వక్క నీకేరా….

కొంటె ఊపు సరి , కొంగు సైగ మరి
ఈ అల్లరి హద్దులు దాటకే బుల్లెమ్మా..

హే సత్యభామా సత్యభామా సంగతేంటమ్మా..ఆ..
వేళకాని వేళల్లోనా పిలుపులేంటమ్మా…

పుట్టలోని పట్టుతేనే..
ఏమైందే ఓయమ్మా హే..

అయ్యయ్యో పుట్టలోని పట్టుతేనే..
ఏమైందే ఓయమ్మా..
పట్టె మంచం కిర్రుమనగా..
వలికింది మావయ్యా

అరె కయ్యాలమారి కవ్విళ్లుకోరి
కాకమీద వున్నావే.. ఏ..
ముద్దెట్టుకోరా ముచ్చట్లు తీరా
పాలబుగ్గ నీదేరా….

సక్కగుంది సిరి ,తప్పదమ్మా గురి
కన్నె ఆశే అందులు కాసుకు బుల్లెమ్మా.

సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా..ఆ..
వేళకాని వేళల్లోనా పిలుపులేంటమ్మా..
సందమామ సందమామ సరసమాడయ్యా.. ఆ..
నిన్ను చూసిన ఘడియనుండి నిదురలేదయ్యా..

పుత్తడి బొమ్మే నీవా.. ఆహ..
అందానికి అర్థం నీ..వా
నచ్చినవాడివి లేరా..
నా ప్రాణమే నీవని తెలుసుకోరా..

_______________________________

చిత్రం: సింహరాశి
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: పోతుల రవికిరణ్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత మోహన్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.