శబరీ కొండలలో – ఆ బంగరు కోవెలలో ॥2॥
వెలసితివా ఆ శిఖరముపై నీ జ్యోతి స్వరూపముతో
ఇలగా వెలసావే – మా దేముడవైనావే
॥శబరి కొండలలో॥
చరణం 1: తులసి మాలను మెడను ధరించి
ఇరు సంధ్యలలో స్నానము చేసి
పూజలు చేశామే – నీ భజనలు చేశామే
॥శబరి కొండలలో॥
చరణం 2 : స్వామి శరణమే జపమంత్రముగా
విషయ వాసనలు తృణప్రాయముగా
సాధన చేశామే – నీ భక్తులమయ్యామే
॥శబరి కొండలలో॥
చరణం 3: ఇరుముడి మూటను శిరమున దాల్చి
వావరు స్వామిని తోడుగ చేసి
త్రోవను చూపావే – మాగమ్యము చేర్చావే
॥శబరి కొండలలో॥
చరణం 4: పంబానదిలో స్నానము చేసి
పదునెట్టాంబడి నధిరోహించి
దర్శనమొందామే – ధన్యత పొందామే
॥శబరి కొండలలో॥
In English Version:
Shabari Kondalalo – Aa Bangaru Kovela Lo ×2
Velasitivaa aa shikharamupai nee jyoti swaroopamuto
Ilaga velasaave – maa demudavainave
॥Shabari Kondalalo॥
Charanam 1:
Tulasi maalanu medanu dharinchi
Iru sandhyalalo snaanamu chesi
Poojalanu chesaame – nee bhajanalu chesaame
॥Shabari Kondalalo॥
Charanam 2:
Swami sharaname japamantramuga
Vishaya vaasanalu trunaprayamuga
Saadhana chesaame – nee bhaktulamayyame
॥Shabari Kondalalo॥
Charanam 3:
Irumudi mootanu shiramuna daalchi
Vaavaru Swaminitoduga chesi
Trovanu choopaave – maagamyamu cherchaave
॥Shabari Kondalalo॥
Charanam 4:
Pamba nadilo snaanamu chesi
Padu-nettambadi nadhirohinchi
Darshanamondaame – dhanyata pondame
॥Shabari Kondalalo॥
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
