Home » రోజా మొక్క మల్లె పొద: అడవిలో ఆనందమైన జీవితం

రోజా మొక్క మల్లె పొద: అడవిలో ఆనందమైన జీవితం

by Lalitha Pandala
0 comment

అనగనగా ఒక అడవిలో రెండు మొక్కలు జీవిస్తూ ఉండేవి. ఒక మొక్కపేరు రోజా, అలాగే మరో మొక్క పేరు మల్లె పొద ఉండేవి. రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఒక దానితో ఒకటి బాగా మాట్లాడుకొనేవి, ఒక దాని వంక మరొకటి చూసుకుంటూ ఉండేవి. అలాగ రోజులూ గడుస్తున్నాయి. రోజా మొక్క నేను చాలా అందంగా ఉన్నాను. నేను ఈ అడవికే రాణిలా ఉంటాను. అని అనుకుంటూ పక్కన ఉన్న మల్లె పొద వైపు చూసి మళ్లీ బాధ పడుతూవుండేధి. ఇంత అందంగా ఉన్నాను ఏం లాభం తనని చూడు ఎంత తెల్లగా చక్కగా అందంగా సుకుమారంగా పరిమళాలను వెదజల్లుతుందో అని అనుకుని బాధ పడుతూ ఉండేది.

telugu moral stories

ఈ అడవికే మంచి పరిమళాలను పంచుతుంది నేను చూడు ఎలా ఉన్నానో అని అనుకుంటూ ఉండేది. అలాగే మల్లి పొద కూడా నేను ఎంతో మంచి సువాసనను ఇవ్వగలను కానీ ఏం లాభం ఎవ్వరూ అడవికి వచ్చినా. ఆ అందమైన రోజా పూవ్వు వంకే చూస్తారు ఇష్టపడుతారు అని అనుకుంటూ ఉండేది.

కొద్ది రోజులకి అడవిలో రోజా మొక్క, మల్లె పొద మద్యలో ఒక గడ్డి పువ్వు పూసింది. ఆ గడ్డి పువ్వు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క చూస్తే మంచి అందమైన రోజా పువ్వు మరో పక్కన చూస్తే మంచి పరిమళాన్ని వెదజల్లే మల్లె పొద వీటి రెండింటి నుండి వచ్చే పరిమళాలను ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా జీవితాన్ని గడిపేస్తుంది.

ఈ కథ సారంశాము ఏంటంటే- ఉన్నదానితో సర్దుకుపోకుండా అత్యాశకు పోవడం మంచిది కాదు. అలాగే “అత్యాశకు పోతే ఎప్పుడు నిరాశే మిగులుతుంది” అనేది ఈ కథ సారంశాము.

ఇలాంటి మరిన్ని తెలుగు కథల కొరకుతెలుగు రీడర్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment