ఒక ఊళ్లో రాము సోము అనే ఇద్దరు స్నేహితులుండే వారు సోము గ్రుడ్డివాడు. రాము కుంటివాడు. ఒక రోజున రాము సోముతో ఈ ప్రక్క ఊర్లో ఏదో జాతర జరుగుచున్నుదట చాలా మంది భక్తుల ధనవంతులు కూడా అక్కడికి వస్తారు. మనం అక్కడికి వెళ్తే ధర్మం రూపేణా మంచి ఆదాయం వస్తుంది. అన్నాడు దానికి సోము ఆ ఊరేమో చాల దూరంలో ఉంది. నీవు కుంటివాడవు. నేను గుడ్డివాణ్ణి మనం అక్కడికి వెళ్ళెదెట్లా అన్నాడు.
నీవు అటువంటి దిగులేమి పెట్టుకోకు. మనం అక్కడికి చేరుకోవడానికి నేనొక ఉపాయం ఆలోంచిచాను. నీవు గ్రుడ్డి వాడవైనా నడువగలవు నేను కుంటివాడినయినా చూడగలవు. కాబట్టి ఒకరి కొకరు సాయం చేసుకొంటూ మనమిద్దరమూ అక్కడికి హాయిగా చేరవచ్చు నన్ను నీ భుజం మీద కుర్చీ బెట్టు కొని నడుస్తుంటే నేను నీకు దారి చూపు తాను అన్నాడు. ఆ సలహా సోముకి బాగా నచ్చింది.
ఇద్దరూ ఇష్టపడి వాళ్ళ ప్రమాణం యొదలెట్టారు. ఎట్లాగైతేనేం జాతర జరిగే ప్రదేశానికి చేరుకొన్నారు. వాళ్ళ అదృష్టం కొద్ది చాల ఎక్కువ ధనమే పొగయ్యింది. ఆనందంగా అదే పద్దతిలో యిద్దరూ తిరిగి వాళ్ళు ఊరు చేరుకొన్నారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.