మా ఊరి బాయున్నది బాయికాడ చెట్టున్నాది
మా ఊరి బాయున్నది బాయికాడ చెట్టున్నాది…
హ బాయికాడ హ చెట్టుకింద
హ చెట్టుకింద కూసోబెట్టి రాజిగో నా రాజిగా
నీకు సింతపండు తినిపిస్తా రారో నా రాజిగా
చెట్టుకింద కూసోబెట్టి రాజిగో నా రాజిగా
నీకు సింతపండు తినిపిస్తా రారో నా రాజిగా
మీ ఊరి బాయికాడికి నేను రాను పోయే పిల్లా
మీ ఊరి బాయికాడికి నేను రాను పోయే పిల్లా…
నీ అయ్యా అవ్వా అరె నీ అయ్యా అవ్వా
అరె నీ అయ్యా అవ్వా మరి నన్నే చూస్తే మరదల నా మరదల
తిండి తిప్పలు లేక కూసోబెడతారు నా ముద్దుల మరదల
నీ అయ్యా అవ్వా మరి నన్నే చూస్తే మరదల నా మరదల
తిండి తిప్పలు లేక కూసోబెడతారు నా ముద్దుల మరదల
రమ్మంటే రానంటావు పొమ్మంటే పోతంటావు
ఫోన్ చేస్తే కుదరదంటూ ఎంటెంటే పడుతుంటావు..
మనసు ఆగమాగం మనసు ఆగమాగం
మనసు ఆగమాగమైతాంది రాజిగో నా రాజిగా
జర్ర యడికైనా తోల్కపోరా నా ముద్దుల రాజిగో
మనసు ఆగమాగమైతాంది రాజిగో నా రాజిగా
జర్ర యడికైనా తోల్కపోరా నా ముద్దుల రాజిగో
రమ్మంటే రానంటాను పొమ్మంటే పోనంటాను
వద్దు నీతో తిప్పాలంటు ఎంటెంటే పడుతుంటాను…
నిన్ను చూడకుండా అరె అరె నిన్ను చూడకుండా
అబ్బబ్బా నిన్ను చూడకుండా ఉండలేను మరదల నా మరదల
నిన్ను చూస్తే దిల్ కుష్ అయితది నా చిట్టి మరదల
నిన్ను చూడకుండా ఉండలేను మరదల నా మరదల
నిన్ను చూస్తే దిల్ కుష్ అయితది నా చిట్టి మరదల
మా ఊరి బాయున్నది బాయికాడ చెట్టున్నాది
మా ఊరి బాయున్నది బాయికాడ చెట్టున్నాది…
హ చెట్టుకింద కూసోబెట్టి రాజిగో నా రాజిగా
నీకు సింతపండు తినిపిస్తా రారో నా రాజిగా
నీ అయ్యా అవ్వా మరి నన్నే చూస్తే మరదల నా మరదల
తిండి తిప్పలు లేక కూసోబెడతారు నా ముద్దుల మరదల..
_____________________
పాట: రాజిగో నా రాజిగా (Rajigo Na Rajiga)
కొరియోగ్రాఫర్లు : సోమేష్ కొండపల్లి (Somesh Kondapalli) & బాబీ ఢీ (Bobby Dhee)
సాహిత్యం: నవీన్ అజ్ (Naveen Aj)
గాయకులు: మారుతీ (Maruthi) & తేజు రావు (Teju Rao)
సంగీత దర్శకుడు: రెక్సన్ వేజెండ్ల (Rexson Vejendla)
నటీనటులు : ప్రసాద్ ఢీ (Prasad Dhee) & కావ్యశ్రీ ధువచర్ల (KavyaSri Dhuvacharla)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.