Home » పుట్టగానే పెట్టారు పేరు సాంగ్ లిరిక్స్ – లగ్గం

పుట్టగానే పెట్టారు పేరు సాంగ్ లిరిక్స్ – లగ్గం

by Vinod G
0 comments

పుట్టగానే పెట్టారు పేరు
ఒట్టు నేనే నీ పట్టదారు
బుజ్జి బంగారు బావ కంగారు
తీరగా మార్చుకో ఇంటిపేరూ

సీర సారె సిద్ధంగా
ఉంచింది మీ అత్త గారు
సిద్దమై జూస్తుంది
నీ కోసమే మాఊరు

బావ బాగుందయ్యా నీ జోరు
మా బాపూతోచెప్పొక్కమారు
నీతోటి నాకు లగ్గం అయితందంటే
సిగ్గు పడుతుంది మాఇంటి సూరు…

కొమెరమెళ్లి మల్లన్నకూ
ముడుపు గట్టేదుంది సారు
నల్లపని తీస్కపొయి
మన పెళ్ళికి దిష్టి తీస్తారు

అయ్యగారు అంటే విన్న మాట
జాతకాలు కూడా కలిసినయాట
సిన్న నాడు ఆడుకున్న ఉత్త ఆట
అస్సలయింది ఈనాడే మొదలాట ఆట పాట

నీకు నాకు నలుగేప్పుడోయ్
మేనత్త సుగుణమ్మ కొడుకా
లగ్గం ఇంక ఎన్నడనీ
అడిగింది మా చింతమొలక

నీకు నాకు ముడిపడ్డదే
నీలమ్మ తొలుసూరి బిడ్డా
రాసిపెట్టి ఉన్నాదిలే
నీదేనే జనగామ అడ్డా

అవ్వ నీకు దాచిపెట్టింది
అల్మారాలో దండా కడియల్
అమ్మ జూడు సిద్ధం చేస్తుంది
అపుడే విందుకు సకినాల్ వడియాల్

మంగళారం అంగడికెళ్ళి
కొనుక్కోవాలే కొత్తా బట్టల్
అవుసులోళ్ల వీధికి బోయి
ఆర్డర్ ఇయ్యాలే కమ్మలు బుట్టల్

మా అత్తగారు పెట్టే అద్దాల బీరువా తాళాలు నడుముకు గుచ్చాలే
మా మేనమామను పంపి చారిగారితో డబులుకాటు చేయించాలే

ఎన్ని ఏండ్ల పొద్దో మీసం మొలిచీ
విలువ పెరిగే దానికిప్పుడే నిన్ను వలచీ
మురిసేదాన్ని సినెమాలల్లేనే జూసీ
ముందుకొచ్చే ఆ సుముహూర్తం మా ఆత్రాలే తెలిసీ

నీకు నాకు నలుగేప్పుడోయ్
మేనత్త సుగుణమ్మ కొడుకా
లగ్గం ఇంక ఎన్నడనీ
అడిగింది మా చింతమొలక

నీకు నాకు ముడిపడ్డదే
నీలమ్మ తొలుసూరి బిడ్డ
రాసిపెట్టి ఉన్నాదిలే
నీదేనే జనగామ అడ్డా

నీకు నాకు నలుగేప్పుడోయ్
మేనత్త సుగుణమ్మ కొడుకా
లగ్గం ఇంక ఎన్నడనీ
అడిగింది మా చింతమొలక

నీకు నాకు ముడిపడ్డదే
నీలమ్మ తొలుసూరి బిడ్డ
రాసిపెట్టి ఉన్నాదిలే
నీదేనే జనగామ అడ్డా


చిత్రం: లగ్గం (Laggam)
గాయకులు: చరణ్ అర్జున్, శ్రీనికా మహతి
సాహిత్యం: చరణ్ అర్జున్
సంగీతం: చరణ్ అర్జున్
దర్శకత్వం: రమేష్ చెప్పాల
తారాగణం: సాయి రోనక్ కటుకూరి, ప్రజ్ఞా నగ్రా తదితరులు

ముషాయిరా (Mushayira) సాంగ్ లిరిక్స్ – లగ్గం (Laggam)

మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment