ప్రేమ యాత్రలకు బృందావనము
నందనవనము యేలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా
వేరే స్వర్గము యేలనో … అహ హ అహ హ హ
కులుకులొలుకు చెలి చెంతనుండగా
వేరే స్వర్గము యేలనో
ప్రేమయాత్రలకు బృందావనము
నందనవనము యేలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము
కాశీప్రయాగలేలనో
ప్రేమించిన పతి ఎదుటనుండగా
వేరే దైవము యేలనో … అహ హ అహ హ హ
ప్రేమించిన పతి ఎదుటనుండగా
వేరే దైవము యేలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము
కాశీప్రయాగలేలనో
చెలి నగుమోమె చంద్రబింబమై
పగలే వెన్నెల కాయగా
చెలి నగుమోమె చంద్రబింబమై
పగలే వెన్నెల కాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతో
జగమునె ఊటీ శాయగా … అహ హ అహ హ హ
సఖి నెరిచూపుల చల్లదనంతో
జగమునె ఊటీ శాయగా
ప్రేమయాత్రలకు కొడైకెనాలు
కాశ్మీరాలూ యేలనో
కన్నవారినే మరువజేయుచూ
అన్ని ముచ్చటలు తీర్చగా
అహ హ అహ హ హ … అహ హ అహ హ హ
కన్నవారినే మరువజేయుచూ
అన్ని ముచ్చటలు తీర్చగా
పతి ఆదరణే సతికి మోక్షమని
సర్వశాస్త్రములు చాటగా … అహ హ అహ హ హ
పతి ఆదరణే సతికి మోక్షమని
సర్వశాస్త్రములు చాటగా
తీర్థయాత్రలకు కైలాసాలు
వైకుంఠాలూ యేలనో
అన్యోన్యంగా దంపతులుంటే
భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బృందావనము
నందనవనము యేలనో
పాట పేరు: ప్రేమ యాత్రలకు (Prema Yatralaku)
సినిమా పేరు: గుండమ్మ కథ (Gundamma Katha)
గానం: ఘంటసాల (Ghantasala), సుశీల (suseela)
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు (Pingali Nagendrarao)
సంగీతం: ఘంటసాల (Ghantasala)
దర్శకుడు: కమలాకర కామేశ్వరరావు (Kamalakara Kameswara Rao)
తారాగణం: ఎన్.టి.రామారావు (N. T. Rama Rao), అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao), సావిత్రి (Savitri), జమున (Jamuna) తదితరులు
ఇటువంటి మరిన్ని పాటలకోసం చూడండి తెలుగురీడర్స్ లిరిక్స్