37
- ఎ రాయి వద్దన్నా, ఆ రాయి మాత్రం కావాలి
- ఉప్పురాయి
- ఒక అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు
- వేరుసెనగ కాయ
- ఒక అరలో ముగ్గురు దొరసానులు
- ఆముదపు గింజ
- కారు గానీ కారు – పరుగులో మహజోరు
- పుకారు
- కాళ్లు ఉన్నా నడవలేనిది
- కుర్చీ
- కాళ్లులేనోడు కాశీదాకా పోయాడు
- పాము
- కుయ్యదు మెయ్యాదు కడి వెడు పాలిస్తుంది
- తాటి చెట్టు
- కొడిగుడ్డంత బంగారం ఏనుగు కూడా ఎత్తలేదు
- అగ్గి
- కోస్తే తెగదు, కొడితే పగలదు
- నీడ
- గట్టు కాలంగా – బట్టలు ఎండవేస్తారు
- రొట్టెలు
- ఒక వైపు తింటుంటాడు, మరో వైపు ఇడుస్తుంటాడు
- తిరగలి
- ఒక స్తంభానికి నలుగురు దొంగలు
- లవంగం
- ఓక్కటి పట్టుకుంటే రెండు ఊగులాడుతాయి
- తక్కేట
- దానిపై చేయివేస్తే కరవందే వదలదు
- నిప్పు
- ఓళ్ళంతా ముళ్ళు , కడుపంతా చేదు
- కాకరకాయ
- కందులూరి కామాక్షి కాటుక పెట్టుకుంది
- గురివింద గింజ
- కడుపు నిండా నల్లరాళ్ళు, తెల్లటి పేగులు
- సీతాఫలం
- పరుపు మీద పరుపెక్కింది
- విసురు రాయి
- కథల కామిరెడ్డికి వీపున మోకాళ్ళు
- మిడత
- కళ్లుండి చూడలేదు, కళ్ళుం డి నడవలేదు
- నవారు మంచం
- కంపలో కోడి కదలకుండా గుడ్డు పెట్టింది
- పుట్టగొడుగు
- కడవలో నీరు – కదలని పాము – పడగతో ఆడు
- దీపం
- కానరాని అడవిలో కర్రావు మేస్తుంది
- పేను
- కానరాని విత్తనం, ఘనమైన వృక్షం
- మర్రిచెట్టు
- కాళ్ళున్న పాదాలు లేనిది
- కుర్చీ
- కన్ను ఉన్న తల లేనిది
- సూది
- చారల చారల పాపడికి మెత్తని దూది కుచ్చు
- ఉడుత
- ఏడూ కొండల అవతల ఎర్రెద్దు పరుగుతీస్తాడు
- సూర్యుడు
- చెట్టు కొట్టంగా పిట్ట ఎగిరే
- పేడు
- అమ్మ అంటే కలుస్తాయి, అయ్యా అంటే కలవవు
- పెదాలు
- చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చూసే వాళ్ళేగాని కోసేవాళ్ళు లేరు.
- తేనె పట్టు
- కిట కిట తలుపులు కిటారి తలుపులు, ఎప్పుడు వేసిన చప్పుడు కావు.
- కను రెప్పలు
- తోకలేని పిట్ట తొంబై ఆమడల దూరం పోతుంది.
- పోస్ట్ లెటర్
- ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్లు
- టెంకాయ
- గుత్తులు గుత్తులు మామిడి గుత్తులు, మధ్యనానికి మాయమయ్యే
- కళ్ళేప
- గట్టు మీద పోరడు, ముట్టంగానే ఏడుస్తాడు.
- డప్పు
- చారెడు కుండలో మానెడు పగడాలు
- దానిమ్మ
- కాగితంపై కదులుతుంది – కార్చుకుంటూ వెళుతుంది
- పెన్ను
- కాయ గాని కాయ
- మెడకాయ
- నీటిలో వెళ్ళుతుంది కాని చేప కాదు
- పడవ
- ఆకాశంలో ఎగురుతుంది కాని పక్షి కాదు
- విమానం
- దారం కాని దారం
- మందారం
- అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
- కవ్వం
- అడ్డం కోస్తే చక్రం – నిలువు కోస్తే శంఖం
- ఉల్లిపాయ
- అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ
- తేనె పట్టు
- ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది
- చీపురు
- ఉద్యోగం సద్యోగం లేదు ఊరంతా వ్యాపకమే
- కుక్క
- ఐదుగిరిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు
- చిటికెన వేలు
- చూస్తే చూపులు – నవ్వితే నవ్వులు
- అద్దం
- చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు
- టెంకాయ
- తెలిసేటట్లు పూస్తుంది – తెలియకుండ కాస్తుంది
- వేరుశెనగ
- అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, మహాలక్ష్మిలాగుంది.
- గడప
- అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్క లాడింది.
- చల్ల కవ్వం
- అమ్మ కడుపున పడ్డాను, అంతా సుఖాన. నిప్పుల గుండు తోక్కాను, గుప్పెడు బుడీడ అయ్యాను.
- పిడిక
- అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు. కొమ్మ కొమ్మకూ కోటి పువ్వులు. అన్ని పువ్వుల్లో రెండు కాయలు.
- ఆకాశం, చుక్కలు, సూర్యుడు, చంద్రుడు
- అడవిలో పుట్టాను. మెదరింట్లో మెలిగాను, వంటినిండా గాయాలు, కడుపు నిండా గేయాలు.
- మురళి
- అడుగులు ఉన్న, కాళ్లు లేనిదే ఏదీ.
- గజం బద్ద….స్కేల్
- ఈ ప్రపంచం లోని వారందరు నా బిడ్డలే, కానీ అమ్మ! అని నన్నెవరూ పిలవరు. ఎం చేయాలన్న ఎం పొందాలన్న నా లోనే, ఎటు వెళ్లాలన్న, నామీదే.
- భూమి
- కిటకిట తలుపులు. కితారు తలుపులు. తీసిన, వేసిన చప్పుడు కావు.
- కంటి రెప్పలు
- రాజుగారి తోటలో రోజాపూలు. చూసేవారే గాని లెక్కవేసేవారు లేరు.
- చుక్కలు
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.