రాజధాని ఐన హైదరాబాద్ కు అందరికి వెళ్లాలని ఉంటుంది. పల్లె ప్రాతంలో నివసించే వారు ఒక్కసారైనా వెళ్లి హైదరాబాద్ లో ఉన్న అందాలను చూడాలనుకుంటారు. తెలుగు ప్రజలకు ఉద్యోగ రీత్య, కోచింగ్ రీత్య, పని రీత్య మొదట గుర్తుకొచ్చేది హైదరాబాదే!. హైదరాబాద్ పెద్ద నగరం కాబ్బటి అక్కడ చుట్టుపక్కల ఎలాంటి ప్లేస్ లు ఉన్నాయో చాల మందికి తెలీదు. ఒక వేళా తెలిసిన కొన్ని తెలిసి ఉంటాయి. అందుకోసం మీకు సహపడడానికి క్రింది ఉన్న ప్రదేశాలను చూడంది.
1. చార్మినార్ (Charminar)
చార్మినార్ ని హైదరాబాద్ లో ప్రజలు రోజు చూస్తూనే ఉంటారు. పల్లె ప్రజలకు చిన్నపుడు పుస్తకాలలో చదువుకున్న నాలుగు స్థంబాల కట్టడం, కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీ కట్టించాడు అనే విషయాలు మాత్రమే తెలిసుంటాయి. పూర్తి వివరణ ఏమిటంటే చార్మినార్ (Charminar) హైదరాబాద్ నగరానికి చిహ్నంగా నిలిచిన ఒక కట్టడం. దీన్ని 1591లో మొహమ్మద్ కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన సుల్తాన్, మొఘల్ సుల్తానేట్ వారసుడు, ప్లేగు వ్యాధి బారిన పడినప్పుడు ఇక్కడే అల్లాని ప్రదించగా అయన వారసుడు కోల్కోవడంతో గుర్తుగా ఈ చార్మినార్ నీ నిర్మించాడు. ఇది 4 మినార్లతో నాలుగు దిశల వైపుగా నిర్మించారు.చార్మినార్ లోపల మొత్తం 147 మెట్లు ఉంటాయి. అక్కడ గోడల మీద ఉన్న చిత్రాలు చాల అందంగా కనిపిస్తాయి. ఈ చార్మినార్ మొత్తం 56 మీటర్ల ఎత్తులో ఉంది. అలాగే ప్రతి మినార్ 48.7 మీటర్ల ఎత్తులో ఉంది. ఇందులో పెద్ద ప్రార్థనా మందిరం మరియు స్త్రీలు ప్రార్థన చేయడానికి ప్రత్యేక స్థలంకూడా ఉంది.
చార్మినార్ చుట్టుపక్కల లాడ్ బజార్ అనే పిలువబడే సందడిగా ఉండే మార్కెట్ ప్లేస్ ఉంది, అక్కడ మీరు నగల నుండి దుస్తులు, సావనీర్‌ల వరకు ప్రతిదీ కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్ అనగానే మొదట గుర్తొచ్చేది చార్మినార్. హైదరాబాద్ కి వెళ్ళినవారు తప్పకుండ ఈ ప్రదేశానికి వెళ్లకుండా అసలు ఉండరు. చిన్న నుండి పెద్ద వరకు చూసే స్థలం. చుట్టూ నాలుగు మినర్లు గడియరాములతో కనిపిస్తాయి.
2. గోల్కొండ కోట (Golconda Fort)
ఈ ప్రదేశాన్ని ఎక్కువుగా చాల సినిమాలలో ఉంటాం. చప్పట్లు కొడితే బయటికి వినిపిస్తాయని చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ళ వరకు తమ సంతోషాన్ని చప్పట్ల రూపంలో వ్యక్తం చేస్తూ ఆనందిస్తుంటారు. గోల్కొండ కోట (Golconda Fort) గురించి వివరణ, హైదరాబాద్ నగరంలో ఒక ప్రసిద్ధ చారిత్రక కోట, దీనికి భారతదేశం చరిత్రలో ప్రముఖ స్థానం కలిగింది. ఇది ఒకప్పుడు కాకతీయుల నుండి కుతుబ్ షాహీ సుల్తానుల వరకు మహానాయకుల పాలనా కేంద్రం. గోల్కొండ కోట తూర్పు దేశాల విలువైన వజ్రాలకు ప్రసిద్ధి, ముఖ్యంగా కోహినూర్, హోప్ డైమండ్, డారియా-ఇ-నూర్ వజ్రాలు గోల్కొండ ప్రాంతం నుండి దొరికినవి అని నమ్ముతారు. కోట దాదాపు 7 కిలోమీటర్ల పొడవైన బలమైన ప్రహరీలతో, 8 సింహా ద్వారాలు వంటి అందమైన రక్షణ నిర్మాణాలతో ప్రత్యేకంగా ఉంటుంది. గోల్కొండ కోటలోని ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఇకో సిస్టమ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. కోట ప్రవేశం వద్ద చప్పట్లు కొడితే, అతికొద్ది దూరంలో ఉన్న “బాలా హిస్సార్ ప్యాలెస్” వరకు శబ్దం వినిపించగలదు. ఇది ఆ కాలంలో రక్షణ చర్యల కోసం ఉపయోగించేవారు.
కోట సాయంత్రం వేళల్లో ప్రకాశవంతంగా ఉంటుంది, ఇది అద్భుతమైన దృశ్యం. తప్పకుండా చూడవల్సిన ప్రదేశం. ముఖ్యంగా ఆ చప్పట్లు సౌండ్ చాల ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అక్కడ కూర్చుని టైం పాస్ చేయొచ్చు.
3. సాలార్ జంగ్ మ్యూజియం (Salar Jung Museum)
మ్యూజియం అంటే వస్తువుల సేకరణ, ఆ వస్తువులలో శిల్పాలు, పుస్తకాలు, ఖడ్గాలు, పాత కాలపు పరికరాలను పొందుపరుస్తారు. దానినే మ్యూజియం అంటారు. అలాంటి వస్తువులను చూస్తుంటే ఆనాటి నాగరికత ఉత్తుపడేలా అనిపిస్తాయి. వాటిలో అంత అర్ధం దగుంటుంది మరి. ఆలా అర్ధం చేసుకునే శక్తీ ఉండడం కూడా ఒక కళ.
ఈ మ్యూజియం మొత్తం సేకరణ సాలార్ జంగ్ III తన జీవిత కాలంలో సేకరించాడు. ఈయన మంత్రిగా కూడా పని చేసాడు. ఇంత గొప్ప సేకరణ ఇంకా ఎక్కడ చూడలేము. 50,000 పుస్తకాలు ఉన్నాయి. వివిధ రాజా వంశీయులకు సంబందించిన ఖడ్గములు ఉన్నాయి. జాడే ఆభరణాలకు సంబదించిన కలెక్షన్లు ఉంది. ఇలా ఒకటి కాదు చెప్పలేనన్ని వాటిని మీరు అక్కడ చూడవచ్చు. మ్యూజియంలో పెయింటింగ్‌లు, శిల్పాలు, సిరామిక్‌లు, మాన్యుస్క్రిప్ట్‌లు మరియు మరిన్నింటితో సహా 43,000 వస్తువుల అద్భుతమైన సేకరణ ఉంది. మ్యూజియంలో 38 గ్యాలరీలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి యూరోపియన్, ఆసియా మరియు భారతీయ కళలతో సహా సేకరణను ప్రదర్శిస్తాయి. ముఖ్యంగా, ఆరోనోఫానా క్లాక్ (The Musical Clock), వీణస్ చతుర్భుజ రూపం మరియు ఆక్సిడెంట్ మరియు ఒరియంట్ కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణలు. ఆరోనోఫానా క్లాక్ ప్రతి గంటకు మ్యూజిక్ వినిపిస్తుంది, ఒక చిన్న వ్యక్తి బయటకు వచ్చి గంటలు కొడతాడు.
- సందర్శకుల సమాచారం: మ్యూజియం శుక్రవారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. టిక్కెట్లను ఆన్‌లైన్‌లో లేదా మ్యూజియం ప్రవేశద్వారం వద్ద కొనుగోలు చేయవచ్చు.
4. హుస్సేన్ సాగర్ (Hussain Sagar)
హుస్సేన్ సాగర్ అనేగానే ముందుగా గుర్తుకు వచ్చేది న్యూస్ లో చూపించే హైదరాబాద్ వినాయకుని నిమర్జనాలు. తరువాత బుద్దుడి విగ్రహం, ట్యాంక్ బండ్. హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో 18 మీటర్ల ఎత్తుతో నిలబెట్టిన పెద్ద బుద్ధ విగ్రహం 450 టన్నుల బరువున్న తెల్లటి గ్రానైట్ రాతితో చెక్కారు. దీనిని 40 మంది శిల్పులు రెండేళ్లపాటు చెక్కారు. ఈ సరస్సు ముఖ్య ఆకర్షణ ఇది. ఈ విగ్రహన్నీ 1992లో ఏర్పాటు ప్రతిష్టించారు. హుస్సేన్ సాగర్‌లో బోటింగ్, స్పీడ్ బోట్ రైడ్, మరియు ఇతర వాటర్ స్పోర్ట్స్‌లను చేయవచ్చు. సరస్సుకు చుట్టూ ఉన్న టాంక్ బండ్ ఒక రహదారి, ఇది సాయంత్రం సమయాలలో ప్రయాణికులతో, సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో వివిధ గొప్ప వ్యక్తుల విగ్రహాలు ఉండటం ఒక ప్రత్యేకత.
సరస్సు చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్, ఇది రాత్రిపూట లైట్లతో ప్రకాశిస్తుంది. ఈ ప్రాంతంలో ఫుడ్ జాయింట్లు మరియు రెస్టారెంట్లు కూడా ఉండటం వలన ఇక్కడ రాత్రిపూట చాలా సందడిగా ఉంటుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ప్రకృతి, సాయంత్ర సమయాలలో సేద తీరడానికి చాలా మంచి స్థలం. ఇది కుటుంబంతో కలిసి సేదతీరడానికి మంచి ప్రదేశం.
5. బిర్లా మందిరం (Birla Mandir)
హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళు ఈ దేవాలయాన్ని చూడకుంటే చాల మిస్ అయ్యినంటే. ఎందుకంటే ఇక్కడ దొరికే ప్రశాంతతా వేరే దేవాలయాలలో దొరకదు. బిర్లా మందిరం (Birla Mandir) హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయం, ప్రధాన ఆలయంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని పోలి ఉంటుంది. ఈ మందిరం బిర్లా ఫౌండేషన్ ద్వారా నిర్మించబడింది, భారతదేశంలో వివిధ నగరాల్లో బిర్లా కుటుంబం నిర్మించిన అనేక మందిరాల్లో ఇది ఒకటి. బిర్లా కుటుంబం మద్దతుతో రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి రంగనాథానంద 1976లో ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఇందులో రామాయణం, మహాభారతం, గీతా వంటి పురాణాల్లోని ప్రస్తావనలు, శ్లోకాలు, మరియు కథలు కుడివైపున రాతిలో చెక్కబడి ఉంటాయి. ఆలయ సముదాయంలో గణేశుడు, శివుడు మరియు దుర్గాదేవితో సహా ఇతర హిందూ దేవతలకు అంకితం చేయబడిన మందిరాలు కూడా ఉన్నాయి.
6. రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)
మన తెలుగు సినీ పరిశ్రమ నటులకు రామోజీ రావు ఫిల్మ్ సిటీ మొదటి మెట్టు లాంటిది. ఎవరైనా నటులు కావాలన్నా, తమ టాలెంట్ తో మెప్పించాలన్న ఇక్కడి నుంచే కష్టపడి తెర మీదకు వచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఈ రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City) హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఒకటి, ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా నిర్మాణ కాంప్లెక్స్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. ఈ ఫిల్మ్ సిటీని 1996 లో రామోజీ గ్రూప్ వ్యవస్థాపకుడు రామోజీ రావు స్థాపించారు. ఇది 2000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, మరియు సినిమాల చిత్రీకరణతో పాటు, పర్యాటకుల కోసం ప్రత్యేక ఆకర్షణలతో నిలుస్తుంది. అమితాబ్ బచ్చన్ గార్డెన్స్, జపనీస్ గార్డెన్స్, మరియు ముగల్ గార్డెన్స్ వంటి వివిధ థీమ్ గార్డెన్స్ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తాయి.
రామోజీ ఫిల్మ్ సిటీలో అనేక ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి, ముఖ్యంగా రామోజీ ఫెస్ట్ సమయంలో. పండుగ సీజన్లో ఈ ప్రదేశం ఇంకా ఎక్కువగా అలంకరించబడుతుంది, మరియు స్పెషల్ షోలు, వేడుకలు ఉంటాయి.
7. శిల్పారామం (Shilparamam)
శిల్పారామం అంటే మట్టి బొమ్మలకు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న పల్లె నాగరికత మొత్తాన్ని బొమ్మల రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. ఎవ్వరైనా సిటీ జీవితం వదిలి ఆలా సరదాగా ఈ పల్లె ప్రదేశానికి వస్తే ఆ కొద్దీ కాలం మనసుకు ప్రశాంతాత లభిస్తుంది. శిల్పారామం (Shilparamam) హైదరాబాద్‌లోని ప్రముఖ సాంస్కృతిక గ్రామం, ఇది భారతీయ శిల్పకళ, హస్తకళలకు ఒక కేంద్రముగా పనిచేస్తుంది. ఇది మాధాపూర్ ప్రాంతంలో హైటెక్ సిటీ సమీపంలో ఉంది. 1992లో స్థాపించబడిన ఈ సాంస్కృతిక గ్రామం గ్రామీణ భారతదేశపు సంప్రదాయ కళలు, రుచులు, మరియు హస్తకళలను ప్రదర్శించడం కోసం ప్రసిద్ధి చెందింది. శిల్పారామంలో ఏర్పాటు చేసిన గ్రామీణ మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ మ్యూజియం భారతదేశం యొక్క గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. కూచిపూడి, భరతనాట్యం, మరియు ఇతర నృత్య రూపాలను పర్యాటకులు ఇక్కడ చూస్తారు. సాంప్రదాయ గర్బా మరియు దాండియా రాస్ ప్రదర్శనలు ఉంటాయి.
శిల్పారామం ప్రత్యేకంగా రాతి శిల్పాల ప్రదర్శనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కళాకారులు ఎంతో నైపుణ్యంతో రాతి శిల్పాలు తయారు చేసి ప్రదర్శిస్తారు. ఈ శిల్పాలు ప్రాచీన భారతీయ కళారూపాల ప్రతిరూపంగా నిలుస్తాయి.
8. నెహ్రూ జూలాజికల్ పార్క్ (Nehru Zoological Park)
డిస్కవరీ ఛానల్ లో చూసే జంతువులన్నీ ఇక్కడ నేరుగా చూడవచ్చు. నేరుగా అంటే మనకు వాటికీ ఫ్లెన్చు అడ్డుగా ఉంటుంది. అవి ఆ ఫ్లెన్చ దాటి బయిటికి రావు. భయపడాల్సిన ఆవరసరం లేదు. బయట తిరిగేవి శిక్షణ ఇచ్చినవి, అవి మన మాట వింటాయి. పార్క్‌లో ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి, ఇవి వివిధ రకాల జంతు జాతులను కలిగి ఉంటాయి. ఇక్కడ ఉన్న ముఖ్యమైన జంతువులలో సింహం, పులి, చిరుత, గుఱ్ఱం, ఏనుగు, జిరాఫీ, జెబ్రా వంటి పెద్ద జంతువులు ఉంటాయి. 160 జాతులకు చెందిన 1,500 పైగా జంతువులు ఉన్నాయి. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో సఫారీ రైడ్ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ సింహాలు, పులులు సహజ వాతావరణంలో విహరిస్తుంటాయి, మరియు సందర్శకులు వాటిని సురక్షితంగా జీప్‌లో కూర్చుని దగ్గరగా చూడవచ్చు. చిన్న పిల్లల కోసం చిల్డ్రెన్ ట్రైన్ రైడ్ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇది పార్క్ అంతటా తిరుగుతూ, పర్యాటకులను వివిధ జంతు సెక్షన్లకు తీసుకెళ్తుంది.
జంతువులను నేరుగా చూసే అవకాశం దొరుకుతుంది. జంతు ప్రేమికులకు ఇది మంచి ప్రదేశం. పిల్లలు కూడా ఆడుకుంటూ ఆనందించే ప్రదేశం. తప్పకుండ మీ కుటుంబంతో వెళ్లి చూడండి.
9. చౌమహల్లా ప్యాలెస్ (Chowmahalla Palace)
హైదరాబాద్ ను పాలించిన రాజుల పాలనలో నిర్మించిన కట్టడం ఇది. ఈ మహాల్ని చూస్తూ ఉంటే పూర్వ రాజుల వైభవం కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. చౌమహల్లా ప్యాలెస్ (Chowmahalla Palace) హైదరాబాద్‌లోని ఒక ప్రాచీన రాజభవనం, ఆసిఫ్ జాహీ రాజవంశం యొక్క ఆస్థాన స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇది నిజాం కాలంలో వారు అధికారిక కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించే స్థలం. “చౌమహల్లా” అంటే “నాలుగు మహల్లులు” అని అర్థం. ఈ ప్యాలెస్ నాలుగు భవనల కలయిక. చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణం 1750లలో నిజాం సలాబత్ జంగ్ ప్రారంభించి, నిజాం అఫ్జల్ ఉద్దౌల సమయంలో 1869లో పూర్తయింది.
ప్యాలెస్ మధ్యలో ఉన్న ఫౌంటెన్ మరియు పెద్ద పచ్చని తోటలు ఈ ప్రాంతానికి మరింత అందాన్ని ఇస్తాయి. ప్యాలెస్‌లో ఉన్న మ్యూజియంలో నిజాంలు ఉపయోగించిన దుస్తులు, ఆయుధాలు, మరియు ఇతర రాజ సంబంధిత పెయింటింగ్స్ ఉంటాయి. తప్పక సందర్శించాల్సిన ప్రదేశం నిజాములు కట్టిన 4 అద్భుత కట్టడాలను కచ్చితంగా చూడాలి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. బెలీజియం నుంచి తెప్పించిన శాండెర్లు చాల అందంగా అనిపిస్తాయి.
- ప్రవేశ రుసుము: ప్యాలెస్ సందర్శించడానికి ప్రవేశ రుసుము ఉంటుంది, విదేశీ పర్యాటకులకు మరియు భారతీయ పర్యాటకులకు వేర్వేరు ధరలు ఉంటాయి.
- సమయాలు: చౌమహల్లా ప్యాలెస్ మంగళవారం నుండి ఆదివారం వరకు తెరిచి ఉంటుంది.
10. లంబిణి పార్క్ (Lumbini Park)
హుస్సేన్ సాగర్ దెగర ఉన్న ఈ లుంబిని పార్క్ చాల అందాలను కలబోసుకుని ఉంటుంది. అక్కడ ప్రదర్శిందే లైట్ షో లు చేసేందుకు రెండు కళ్ళు సరిపోవు. ముఖ్యంగా రాత్రి సమయంలో చాల ఆహ్లాదకరంగా ఉంటుంది. లంబిణి పార్క్‌లో లేజర్ షో (Laser Show) చూసేందుకు చాల బాగుంటుంది. ఈ లేజర్ షో బుద్ధ విగ్రహం, తెలంగాణ సంస్కృతి, మరియు భారతదేశ చరిత్రతో పాటు, మ్యూజిక్ మరియు లైట్స్ కలగలిపి చూపిస్తారు. ఇది దేశంలో అత్యంత ప్రసిద్ధ లేజర్ షోలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సాయంత్రం మ్యూజికల్ ఫౌంటెన్ కార్యక్రమం నిర్వహిస్తారు, అందులో నీరు రకరకాల ఆకారాలలో సాగే మ్యూజిక్‌కు అనుగుణంగా కదలడం చూస్తూ సందర్శకులు ఆనందిస్తారు.
హుస్సేన్ సాగర్ సరస్సులో బోటింగ్ సౌకర్యం లభిస్తుంది. బోటింగ్ చేయడం ద్వారా మీరు సరస్సులో ఉన్న బుద్ధ విగ్రహం దగ్గరికి చేరుకోవచ్చు మరియు పక్కనే ఉన్న అందాలను ఆనందించవచ్చు. ఎవ్వరు ఈ ప్రదేశాన్ని మిస్ చేసుకోవద్దు, రాత్రి పూట అక్కడే ఉండి ఎంజాయ్ చెయ్యండి. పార్క్‌లో పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆట స్థలాలు కూడా ఉన్నాయి, వీటిలో వివిధ రకాల ఆట వస్తువులు, చిన్న రైడ్‌లు, మరియు వినోదకార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే రోజులలో, ముఖ్యంగా వీకెండ్స్, మరియు పండుగ రోజులలో ఈ పార్క్ సందర్శకులతో కిక్కిరిసిపోతుంది.
- పార్క్ ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది, ఇది ఉదయం నడకలకు, సాయంత్రం షికారు చేయడానికి లేదా విశ్రాంతి తీసుకునే వారికీ చాల మంచి ప్రదేశం.
హైదరాబాద్ మరింత గొప్ప ప్రదేశాలు కలిగి ఉంది, మీరు వీటిని సందర్శించడం ద్వారా నగర చరిత్రను, సాంస్కృతిక వైభవాన్ని ఆనందించవచ్చు.
మరిన్ని ఇటువంటి విహారి ల కోసం తెలుగు రీడర్స్ విహారి ను చూడండి.