Home » పెద్దింటిదానివేపిల్ల సాంగ్ లిరిక్స్ – Love Failure Song

పెద్దింటిదానివేపిల్ల సాంగ్ లిరిక్స్ – Love Failure Song

by Lakshmi Guradasi
609 views
Peddintidhanivepilla song lyrics love failure

పాలేరునై పని చేస్తానమ్మా నీ బంగుళాల
నీ గూటికి చేరని ప్రేమెందుకమ్మా నా మనసులల్ల
ఒక్క గాబురాల బంగారు బొమ్మవమ్మా అన్నలల్ల
గింత ప్రేమ పంచితే లాభమేందమ్మా పిచోడిలా

ప్రాణంగా ప్రేమిస్తే తప్పైతదే
పది మంది నోట్ల తిరుగుతామే
అందమైన ఓ చిన్నదాన
నీ అంతస్థుకే నేను అందనమ్మా

నువ్ పెద్దింటిదానివేపిల్ల
ఉండలేవే గుడిసెలల్ల
ప్రేమ ఒక్కటే ఉంది నా ఒళ్ల
అది సరిపోదే నీ కాసులెల్ల

నువ్ పెద్దింటిదానివేపిల్ల
ఉండలేవే గుడిసెలల్ల
ప్రేమ ఒక్కటే ఉంది నా ఒళ్ల
అది సరిపోదే నీ కాసులెల్ల

పచ్చబొట్టునే ఎదలో ఏసుకున్నానే
పిచ్చి ప్రేమ నాకు ఉన్నాగాని చెప్పాలేనులే
పసులకాడికి నేను పోతవున్ననే
ప్రాణమైనదానికి ప్రేమ పంచలేనులే

పొద్దస్తమానము నీ ఇంటిలో
గొడ్డు సాకిరే చేస్తున్ననే
మాసిన గుడ్డతో జీవితము
కన్నీళ్లు కళ్ళల్లో కాస్తున్నానే
కల్మషమె లేని నీ ప్రేమకు
కాటి కాపరిలా కావలినై
కన్నా తల్లి గోస చూడలేక
కడుపులో ఇష్టాన్ని మోస్తున్ననే

ఇంత ప్రేమించి వదిలేయలేనే
ఏంత ప్రేమున్న దాస్తున్న చూడే
నీ కంట్లో కన్నీరు నే చూడలేనే
నాకున్న గోసలు నీకు చెప్పలేనే

నువ్ పెద్దింటిదానివేపిల్ల
ఉండలేవే గుడిసెలల్ల
ప్రేమ ఒక్కటే ఉంది నా ఒళ్ల
అది సరిపోదే నీ కాసులెల్ల

నువ్ పెద్దింటిదానివేపిల్ల
ఉండలేవే గుడిసెలల్ల
ప్రేమ ఒక్కటే ఉంది నా ఒళ్ల
అది సరిపోదే నీ కాసులెల్ల

ఒక్కపుటకే మాకు కూడు దొరకదే
ఆకలికి దాట్టుకొని పస్తులుంటమే
అంతురాల ఆ మేడలోన
అందమైన గువ్వవు నువ్వే
ఆశపడితే ఆభరణాలు
చేయించ నాతోని గాదె

నువ్వెప్పుడూ మహారాణిలా
ఉండాలని నేను కోరుకుంటా
మన్నించవే నన్ను జాబిలమ్మ
నీకు నాకు జోడు కుదరదమ్మ

చిన్న చిన్న బతుకులే మావి
మా పక్కన నువ్వు బతకలేవే
బంగుళాల పెద్ద రాణివే
నేను బర్ల కాడ కూలోడినే
జీవితాన్ని నీతో పంచుకోలేనే
ఏడూ అడుగులు నీతో నేను వెయ్యలేనే
అందుకే నీకు దూరమున్ననే
గుండెలో బాధను దాచుకున్ననే

నువ్ పెద్దింటిదానివేపిల్ల
ఉండలేవే గుడిసెలల్ల
ప్రేమ ఒక్కటే ఉంది నా ఒళ్ల
అది సరిపోదే నీ కాసులెల్ల

నువ్ పెద్దింటిదానివేపిల్ల
ఉండలేవే గుడిసెలల్ల
ప్రేమ ఒక్కటే ఉంది నా ఒళ్ల
అది సరిపోదే నీ కాసులెల్ల

నువ్ పెద్దింటిదానివేపిల్ల
ఉండలేవే గుడిసెలల్ల
ప్రేమ ఒక్కటే ఉంది నా ఒళ్ల
అది సరిపోదే నీ కాసులెల్ల

_______________________________________________

•పాట: పెద్దింటిదానివేపిల్ల (Peddintidhanivepilla)
•లిరిక్స్-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేష్ అర్కంతి (Suresh Arkanti)
•సంగీతం: కృష్ణుడు (Krishnudu)
•గాయకుడు: హన్మంత్ యాదవ్ (Hanumanth Yadav)
•కాస్టింగ్: అర్జున్‌దేవ్ (Arjundev), జోష్న (Joshna)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.