అహ
వంకర పాపడలవుదీత్తున్నవు యాడికి బోతున్నవు తెల్లటి అంగి గీతల లుంగీ
యాడికి బోతున్నవు తెల్లటి అంగి గీతల లుంగీ
అరె
హైదరాబాదు అందాలు జూడ పట్నం బోతున్ననే గంగ సారాల బంగారు బొమ్మ
పట్నం బోతున్ననే గంగ బంగారు సారాల బొమ్మ
నా మదిలో ఏదుందో తెలుసుకోకుండానే నన్నొదిలి పోతున్నావ తెల్లటి అంగి గీతల లుంగీ
నన్నొదిలి పోతున్నావ తెల్లటి అంగి గీతల లుంగీ
మారి
నామీద మనసైతే నీకింత భయమేల తెగించి గడప దాటే గంగ సారాల బంగారు బొమ్మ
పట్నము జుపిత్తనే గంగ సారాల బంగారు బొమ్మ
నీతో
పట్నమైతే నేనొత్త గాని నా మేనమామలు రా తెల్లటి అంగి గీతల లుంగీ
నను జుత్తరేమోను రా తెల్లటి అంగి గీతల లుంగీ
అబ్బబ్బ
బురుజు సాటుకు నువ్వు నిలవడి గాజుల సడి జేయవే గంగ సారాల బంగారు బొమ్మ
రిబ్బన ఎగరెయ్యవే గంగ సారాల బంగారు బొమ్మ
రిబ్బెన గాజుల సడి జెద్దామంటే కాపోళ్ల కనకవ్వ రా తెల్లటి అంగి గీతల లుంగీ
నా వంక జూత్తాంది రా తెల్లటి అంగి గీతల లుంగీ
అరె
సందేళ గొట్టంగా సందుల్ల కెళ్ళి మన ఊరి పొలిమేర దాటి గంగ సారాల బంగారు బొమ్మ
కోరుట్ల నువ్వు రాయే గంగ సారాల బంగారు బొమ్మ
అయ్యో
కోరుట్ల కత్తంటే ఎడమ కన్ను అదిరి నల్లబిల్లి ఎదురొచ్చేరా తెల్లటి అంగి గీతల లుంగీ
గుండెల్లో గుబులాయారా తెల్లటి అంగి గీతల లుంగీ
అబ్బో
ఎడమ కన్ను అదిరి పిల్లి ఏదురు వచ్చెనని వట్టి మాటలు జెప్పకే గంగ సారాల బంగారు బొమ్మ
ఆశల్లో నన్ను ముంచకే గంగ సారాల బంగారు బొమ్మ
యట్లయితే గట్లాయే బెత్తార మంగడి జగిత్యాల నేనొత్తరా తెల్లటి అంగి గీతల లుంగీ
నా గోడు వినిపిత్తరా తెల్లటి అంగి గీతల లుంగీ
నీ వట్టి మాటలాపి జంటగట్టరాయే నామీద ప్రేమలుంటే గంగ సారాల బంగారు బొమ్మ
నువ్వు నన్ను జేర రాయే గంగ సారాల బంగారు బొమ్మ
కంటికి రేప్పొలే గాపాడి సాకిండ్రు నన్ను గన్నోల్లనిడిసి తెల్లటి అంగి గీతల లుంగీ
నీతోనే ఎట్లద్దురా తెల్లటి అంగి గీతల లుంగీ
ఈడు కొచ్చేదాకా అయ్యబ్బా తోడంట ఇకనుండి తోడునీడ గంగ సారాల బంగారు బొమ్మ
పానమోలే జూసుకుంటా గంగ సారాల బంగారు బొమ్మ
నీ మోజులోబడి మావోళ్లను ఇడిసి నీతోటి నేనొత్తేరా తెల్లటి అంగి గీతల లుంగీ
నడిమధ్య వదిలెయ్యకు తెల్లటి అంగి గీతల లుంగీ
అబ్బా
అయ్యవ్వకు ఒక్కోన్ని వట్టేసి జెబుతున్నా నిను విడిసి నేనుండనే గంగ సారాల బంగారు బొమ్మ
కడదాకా తోడుంటానే గంగ సారాల బంగారు బొమ్మ
కాకల్లా ఓరి కడ్డుల్లా సాంగ్ లిరిక్స్ – జానపద పాట
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి