Home » కాకల్లా ఓరి కడ్డుల్లా సాంగ్ లిరిక్స్ – జానపద పాట

కాకల్లా ఓరి కడ్డుల్లా సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
337 views
kaakalla ori kaddulla folk song lyrics

(మందు పెట్టినా మారడురా ..
కాకల్లా ఓరి కడ్డుల్లా)

పొద్దూబోడిసి కోడి గూసిన మంచంలకెళ్ళి లెవడురా కాకల్లా ఓరి కడ్డుల్లా
ఎందుకు నూనె ఎగుదురా కాకల్లా ఓరి కడ్డుల్లా

తలుగు దెంపుకున్న బర్రె ఎగిరినట్టు మారు మాటలే మాట్లాడకే వగలాడి ఓ గయ్యాడి
ఎల్లకాలం ఇగ ఈ లోల్లులే వగలాడి ఓ గయ్యాడి

ఆడగట్టే అయ్యవనుకుంటే ఆగంజేసే సోపతి రా కాకల్లా ఓరి కడ్డుల్లా
మందు పెట్టినా మారడురా కాకల్లా ఓరి కడ్డుల్లా

మేనమామ బిడ్డవని లగ్గం జేసుకున్ననే వగలాడి ఓ గయ్యాడి
నా పాణం దీసుకుంటీనే వగలాడి ఓ గయ్యాడి

కడుపు నిండా తాగొచ్చి నన్ను కట్టందుకోని కొడతవా కాకల్లా ఓరి కడ్డుల్లా
నీ కంట్లో కొర్రాయి బెట్టరో కాకల్లా ఓరి కడ్డుల్లా

కట్ట కట్టలు కట్నంబోసి బంగుల నేను గట్టినా వగలాడి ఓ గయ్యాడి
పైస దెచ్చి నాపేరాయె వగలాడి ఓ గయ్యాడి

ఒక్క కోడుగుడ్డు దెచ్చి ఆమ్లెట్ బోస్తేనే తింటడురో కాకల్లా ఓరి కడ్డుల్లా
కౌసులేక బువ్వ ముట్టడురో కాకల్లా ఓరి కడ్డుల్లా

ఇనుపుకాయితం ఇవానమిత్త లొల్లి ఆపకుంటే ఇయ్యాల వగలాడి ఓ గయ్యాడి
గ రంది లేకుండా ఉంటనే వగలాడి ఓ గయ్యాడి

రెక్కల మీద కట్టం నాది ఎల్లలేనిదాన్ని జేయకురా కాకల్లా ఓరి కడ్డుల్లా
నా బతుకుల మన్ను బోయకురా కాకల్లా ఓరి కడ్డుల్లా

కోపాన ఓ మాటే గాని కొండంత ప్రేమ నీ మీదనే బంగారి ఓ సింగారి
కయ్యాలు ఉన్నా కలిసుందమే బంగారి ఓ సింగారి


దుర్గమ్మ కొలుపు సాంగ్ లిరిక్స్ – జానపద పాట

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.