Home » పల్లకిలో పుత్తడి బొమ్మ సాంగ్ లిరిక్స్ – Love Failure Song

పల్లకిలో పుత్తడి బొమ్మ సాంగ్ లిరిక్స్ – Love Failure Song

by Lakshmi Guradasi
0 comments
Palakilo Puttadi Bomma song lyrics Love Failure

నీ ఏలు బట్టుకున్న వాడేనా
ఏరి కోరి కట్టుకునేది
విడి పోను అన్న నీ ప్రేమేనా
వీడ్కోలు పలికింది

కారు మబ్బులన్నీ కలిసి ఒక్కటయ్యి
మీద పడ్డట్టు ఉందే
ప్రేమ బాసలన్నీ గుండు సూదులయ్యి
గుచ్చుతునట్టుందే

ఓనమాలు రాసిననాడే
ఒకటైనం అన్నవుగానే
ఊహలన్నీ తెలిసిననాడే
వద్దు అన్న బాగుండుగానే
ఇంతలోనే అంత ప్రేమ చూపి
నన్నింత వంచన చేసినవేమే

చిన్నదాన ఉన్నదమ్మ నీ కన్నులోన వెండి వెన్నెలవానా
నంగనాచి ఆటలెన్నో ఆడి తడిపినవే నీ ప్రేమవానలోన

చిన్నదాన ఉన్నదమ్మ నీ కన్నులోన వెండి వెన్నెలవానా
నంగనాచి ఆటలెన్నో ఆడి తడిపినవే నీ ప్రేమవానలోన

మరిచిపోయినావమ్మా నన్ను
ఇడిసివుండలేనమ్మా నిన్ను
తోడులేక నా దారిలోనే
మాటరాక ముగాబోయనే

కన్నా పేగు కాదన్న నన్ను
విడలేదే నా ప్రేమ నిన్ను
నేరమేమి చేసెనే నేను
నిందలేసి వెళ్లి పోయావు

కారు చిక్కట్లన్నీ కలిసి ఒక్కటయ్యి
కళ్ళు పొడిసినట్టుందే
గుండె లోతులోని ప్రేమ గురుతులన్నీ
గుచ్చి సంపుతూవుంటే

ఒట్టులెన్నో పెట్టావుగానే
వగలు పలుకుకుంటా వయ్యారి భామ

ఒట్టులెన్నో పెట్టావుగానే
వగలు పలుకుకుంటా వయ్యారి భామ

పంచ ప్రాణాలన్నీ పంచుకున్న నాడు
పెంచుకున్న ప్రేమ తెంచేల్లిపోతు

పల్లకిలో పుత్తడి బొమ్మ
కన్నీళ్లు పెడుతున్నవే ఎందుకమ్మా
వెయ్యి వర్ణాల వన్నెల బొమ్మ
మాటరాక మూగబొయినవేమ్మా

పల్లకిలో పుత్తడి బొమ్మ
కన్నీళ్లు పెడుతున్నవే ఎందుకమ్మా
వెయ్యి వర్ణాల వన్నెల బొమ్మ
మాటరాక మూగబొయినవేమ్మా

వెళ్ళిపోయినవమ్మా దూరం
చెల్లిపోయెనమ్మా ఈ బంధం
ఎంత ఏడ్చి ఇంకేమి లాభం
తల్లడిల్లిపోతుంది ప్రాణం

నువ్వు లేక రాధమ్మ నవ్వు
నమ్మలేనే లేదంటే నువ్వు
మేడలోని మహారాణి నువ్వే
మరుపురాదే నీ చిరునవ్వే

నువ్వే పాణమంటూ
ప్రేమ పెంచుకుంటూ
నిన్ను నమ్ముకున్నానే

నేనే భారమంటూ
నాతో ఉండనంటూ
ఎట్లా విడిపోయావే

అంత తప్పు ఏం చేసినానే
అమ్మలాగే నిన్ను చూసుకున్నానే

అంత తప్పు ఏం చేసినానే
అమ్మలాగే నిన్ను చూసుకున్నానే

పంచ ప్రాణాలన్నీ పంచుకున్న నాడు
పెంచుకున్న ప్రేమ తెంచేల్లిపోతు

పల్లకిలో పుత్తడి బొమ్మ
కన్నీళ్లు పెడుతున్నవే ఎందుకమ్మా
వెయ్యి వర్ణాల వన్నెల బొమ్మ
మాటరాక మూగబొయినవేమ్మా

పల్లకిలో పుత్తడి బొమ్మ
కన్నీళ్లు పెడుతున్నవే ఎందుకమ్మా
వెయ్యి వర్ణాల వన్నెల బొమ్మ
మాటరాక మూగబొయినవేమ్మా

___________________________________________

♪ పాట : పల్లకిలో పుత్తడి బొమ్మ (Pallakilo Puttadi Bomma)
♪ సాహిత్యం: Dj శివ వంగూర్ (Djshiva Vangoor)
♪ సంగీత దర్శకుడు : మదీన్ Sk (Madeen Sk)
♪ గాయకుడు: Djshiva Vangoor (Djshiva Vangoor)
♪కాన్సెప్ట్ స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: ( Djshiva Vangoor)
♪ నిర్మాత: Dj శివ వంగూర్ (Djshiva Vangoor)
♪ తారాగణం : Dj శివ వంగూర్ (Djshiva Vangoor) & వేద పొన్నం (Vedha Ponnam)

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.