Home » కలగన్నా సాంగ్ లిరిక్స్ – వైభవం

కలగన్నా సాంగ్ లిరిక్స్ – వైభవం

by Vinod G
505 views
kalaganna song lyrics vaibhavam

కలగన్నా
ఈ ప్రతీ అక్షరం నీతో పంచుకున్న
యెదలోనా
దాచినా ప్రేమనీ నీకే చెప్పుకున్న
దిక్కులు అలిగేలా నీకు
ముద్దులు పెడుతూనే ఉన్న
ఇది కలే లే అని
సిగ్గే పడుతునా
బుగ్గే గిల్లుకున్న
ఈ తీపి స్వప్నాన్నే
ఒద్దన్నా రోజు కనేస్తా
నీ ప్రేమ మైకంలో
మొత్తంగా నన్నే మరుస్తా
నా కొంటె చుపుల్తో
నీమీదే బాణం విడుస్తా
తెలివైన పక్షుల్తో
కబురంపి నిన్నే పిలుస్తా

ఓహ్! తెలుసా? వినునా కథనే!
నిదురాలు రావు రాత్రంతా
క్షణమొక యుగమై గడిపేస్తా
కంగారుతో
యడ పెడా గుండె అదిరిందే
బంగారమే
పోయేంతలా పిచ్చే ముదిరిందే
భూమే చీల్చుకొని జన్మే ఎత్త మా తల్లీ సీతకైనా
లంక పయనమై బ్రహ్మాస్త్రాన్ని
సంధించే రాముడేగా
బుద్ధిగ మనువాడాలంటూ
పెద్దలు తిడుతూనే ఉన్న
సుందరవదన నీకోసం
మొండిగ ఎదురే చూస్తున్న
ఈ ఎదురుచూపులే
చెరిగిపోవగా
నన్నే చేరుకోవా?
ఆ ఇంద్రధనుసల్లే
అందంగా నీకై నిలుస్తా
కరిమబ్బు వర్షంలో
తడిచైనా నిన్నే కలుస్తా

హఠాత్తుగా యేదో సెగ నాలో రగిలిందే
తుఫానులా యదే మరో వైపే కదిలిందే
ఇట్టా మనసునే పటా పంచలే చేసే ధీరశూర
కన్నె వయసులో వన్నె వైభవం నన్నే చేరుతుందా?
ముద్దుల లలన నీ కోసం
రెక్కల గుర్రం ఎక్కొస్తా
హద్దులు చెదిరేలా మొత్తం
చక్కగ నినునే ప్రేమిస్తా
ఇది కలే కాదని
సిగ్గే విడిచినీ
బుగ్గే గిల్లుతున్న
నీ అమ్మ నాన్నల్నే
అత్తమ్మ మామ అని పిలుస్తా
ఆ ఏడు అడుగుల్నే
అచ్చంగా నీతో నడుస్తా
నీ కోటి ఆశాల్నే
ఒక్కోటి నేనే తీరుస్తా
మొహమాటపడకుండా
ఈ పాటే నీతో పాడేస్తా


మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.