మన్ను గూడ నాదని
మనువడిగితే నిన్ను
మనువయ్యా పో అని
వెళ్లగొడితిరే నన్ను
కూలి నాలి నాదని
మనువడిగితే నిన్ను
కుళ్లపొడిసి పో అని
తరిమేస్తిరే నన్ను
అయ్యినోనైనా అవమానిస్తూ
ఏంకానట్టు వెళ్లిపోమంటే
కాలుతున్న మనస్సు సాక్షిగా
కన్న తల్లి సాక్షిగా
మల్లి కాలు మోపుతా
నిన్ను కట్టుకునే వాడిగా
వేలు పట్టుకునే వాడిగా
పాల కాను పాత సైకిలి
ఏదో రోజు కారు లై వస్తాయ్ ఏమోనే
కాదనుకున్న వాడిని
ఏదోరోజు కాళ్ళు కడుగా వస్తారేమోనే
బతుకు దెరువుకే బయటకొచ్చిన
అందమైన అడవినే దాటి వచ్చిన
దిక్కులేని పక్షినే ఆకలేసినా
మళ్ళి రాను వెనకకే జివి గుంజిన
అర్ధమ రాతిరి అమ్మ కల్లోకొస్తదే
జొన్న రొట్టె మీద మడికాయ తొక్కు తెస్తదే
కళ్ళల్లో తిరిగే నీ అందమైన రూపమే
మనసారా మాటలాడే ఆ రోజు ఎప్పుడొస్తాదే
కాలుతున్న మనస్సు సాక్షిగా
కన్న తల్లి సాక్షిగా
మల్లి కాలు మోపుతా
నిన్ను కట్టుకునే వాడిగా
వేలు పట్టుకునే వాడిగా
పాల కాను పాత సైకిలి
ఏదో రోజు కారు లై వస్తాయ్ ఏమోనే
కాదనుకున్న వాడిని
ఏదోరోజు కాళ్ళు కడుగా వస్తారేమోనే
చాతనైనంత ఓ ఇల్లు కడుతా
ఇల్లు కట్టినాంక నీ వేలు బడుతా
అవమానించినోళ్ల నోళ్లు కడుతా
రాని సుట్టల్ని పిలిచి సారే పెడుతా
అగ్గి దుడ్ల నడుమున
అక్షింతల వానల
ఊరంతా చూస్తూ ఉంటే
నీ మెళ్ళో పూస్తే కడతానే
ఇంటి పేరు నిలిచేలా
కన్న వారు మురిసేలా
కంటి రెప్పలాగ
గారాలు చేసుకుంటానే
కాలుతున్న మనస్సు సాక్షిగా
కన్న తల్లి సాక్షిగా
మల్లి కాలు మోపుతా
నిన్ను కట్టుకునే వాడిగా
వేలు పట్టుకునే వాడిగా
పాల కాను పాత సైకిలి
ఏదో రోజు కారు లై వస్తాయ్ ఏమోనే
కాదనుకున్న వాడిని
ఏదోరోజు కాళ్ళు కడుగా వస్తారేమోనే
____________________________________
పాట: పాల కాను (Pala Canu)
లిరిక్ రైటర్ – కాన్సెప్ట్ – డైరెక్టర్ : బుల్లెట్ బండి లక్ష్మణ్ (Bullet bandi laxman)
నిర్మాత: సందీప్ నిర్వాన్ (Sandeep Nirvan)
గాయకుడు: రామ్ అద్నాన్ (Ram Adnan)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.