పడిపోయానే పడిపోయానే సఖీ…..
కనబడి నువ్వే కథ మలిచావే సఖీ…
కలలే కన్నులే తెరిచాయే
నిజమై ఎదుటే నిలిచాయే
నను నడిపావే నను నడిపావే
అడుగు అడుగు చనువైతే
ఇలా మనం ఒకటైతే
నువ్వు నేను మనమేలే
ఇరువురి మనసుల పరిచయం ఇది కదా
ఒకరికి ఒకరుగా అరుదుగా దొరికిన విలువగు వరమిదా
చెలియా లా ..
పడిపోయానే పడిపోయానే సఖీ…..
కనబడి నువ్వే కథ మలిచావే ఓ సఖీ…
నీ గుండె పై నే వాలగా గురుతే అయ్యి
నువ్వో సగం నేనో సగం తెలుసా
నీ చేతిలో పారాణిలా అవ్వనా మరీ
నీ అందమే ముద్దాడగా కదిలా
మూడు ముళ్ళ వేడుకే
నా మజిలీ.. నీవే కదా
శతమానం భవతి అనగా
సతిలో సగమై ఉంటాగా
అని మాటిచ్చా అది పాటిస్తా
మనసా వచసా మనమేగా
మనం మనం మురిపెంగా
కలిసామే.. విడిపోమే
ఇరువురి తనువులు పరి పరి విధముల
తపనల నడుమన నలిగిన క్షణమున కలిగిన విరహము
ప్రేమేగా….
పడిపోయానే పడిపోయానే సఖీ…..
కనబడి నువ్వే కథ మలిచావే ఓ సఖీ…
_____________________
పాట శీర్షిక : పడిపోయానే సఖి (Padipoyane Sakhi)
చిత్రం: సోలో బాయ్ (Solo Boy)
సంగీత స్వరకర్త – జుడా శాండీ (judah Sandhy)
గీత రచయిత – పూర్ణా చారి (Purna Chari)
గానం – జుడా శాండీ (judah Sandhy)
నటీనటులు: గౌతమ్ కృష్ణ (Gautham krishna), శ్వేతా అవస్తి (Shweta Avasthi),
నిర్మాత: సెవెన్‌హిల్స్ సతీష్ (Sevenhills Satish)
దర్శకుడు: పి. నవీన్ కుమార్ (P. Naveen Kumar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.