Home » ఓటమి గెలుపు – కథ

ఓటమి గెలుపు – కథ

by Haseena SK
0 comment

జీవితంలో ఒక సారి ఓడటం మరోసారి గెలవడం మాములే గెలిస్తే సంబరం అంబరం చుంబిస్తుంది. అమందానందం వెల్లివిరుస్తుంది మన విజయానికి వీలుగా ಆ దేవుడు మూడు శక్తులు ప్రసాదించాడు. ఇష్టమైనా పని తెలివిగా కుదురుగా చేయడానికి ఇచ్చా దేవిని జ్ఞానదేవతను క్రియాశక్తిని తోడుగా ఉంచాడు. ఏ పనికి ఎలాంటి ఫలితం ఇవ్వాలో అదోక్కటే తన చేతిలో ఉంచుకున్నాడు. పని రెండు రకాలు ఒకటి కోరికతో మన కోసం చేసే పని ఎవరు ఏ పని చేయాలో నిర్ణయిస్తాడు. భగవంతుడు చాయవలసిన రీతిలో బళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తే తగిన ఫలితం వస్తుంది. ఆ నమ్మకం మనకు ఉంచాలి.

తాను కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా ఎలాంటి కోరిక కోరిక పోయినా భగవంతుడు ఈ జగత్ చక్రాన్ని క్షణం తీరక లేకుండా నడిపిస్తూనే ఉన్నాడు. ఆయనకు చూసి మనమూ పని చేయాలి. ఎంతో మనిషిని తప్పకుండా ఆదుకోవాలి. బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవుతాయి. ధనికుడు పేదవాడువుతాడు. గరీబు నవాబుగా మారతాడు ఇవన్నీ కళ్లారాచూస్తూ ఏ పని ముట్టుకుంటే ఏం కొంపಲಂటుకుంటాయోనన్ను భయంతో మనం చేయకపోతేనేం ఎవరో ఒకరు చేసేస్తారు.

అన్న ధీమాతో ఒళ్లు దాచుకోవడం మహాపచారం అది జీవి ధర్మనికి విరుద్ధం మూలపడ్డ యంత్రం తప్పుపట్టి తునాతు కలైనట్టు మన శరీరాలు ఇంద్రియాలు సోమరి పాటుకు సరికాక తప్పదు. పనికి దూరంగా ఉండటం సోమరి తనమే కాదు తమ్మ వంచన కూడా. ఈ పని మనం చేస్తున్నాం కాబట్టి ఫలితం అనుకున్నట్టే రావాలి అనుకోవడం దురాశ. దురాశ వల్ల దు:ఖం కలుగుతుంది. ఒడిపోయానన్న అవేదన అగ్నిగోళంగా మారి కోపావేశానికి కారణం అవుతుంది. కోపిష్టికి ఒళ్లు తెలియదు.

మేదడు మొద్దుబారుతుంది. బుద్ధిజ్ఞానాలు నశించాడు. వల్ల తానూ నశిస్తాడు.పురాణల్లోని దుర్వాసుడు కోపం వల్ల, విశ్వామిత్రుడు కామం వల్ల, భగృడు అహంకారం వల్ల, విభాండకుడు మమకారం వల్ల భంగపడ్డారు. జ్ఞానికి భంగపాటు తప్పనప్పుడు అసలు కర్మ చేయడం దేనికని అడగవచ్చు. సాక్షత్తు ఆ భగవంతుడే కర్మలు చేపట్టుతూ, ఈ జగత్ చక్రం తిప్పుతుండగా మనం చేతులు మూడుచుకుని, కాళ్లు చాపుకొని కూర్చోవడం తగునా? కేవలం మన స్వార్థం కోసం పాటుపడకుండా నలుగురికీ పనికి వచ్చే మంచిపనులు చేపాట్టాలి. అలా విశాల హృదయంతో పనులు చేస్తుంటే ఫలితం పట్ల ఆస్తికి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గెలుపు ఓటముల నడుమ నున్న అడ్డుగీత అంతర్థమైపోతుంది.

అనుకున్నది అయితే మంచిది, అనుకోనిది జరిగినా అదీ మనమంచికేనది తేలుసుకోవడమే వైరగ్యం. గెలుపు ఓటమి నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి. సముద్రానికి అటుపోటు, చంద్రుడికి ఎదుగుదల, తరుగుదల తప్పవు. కష్టసుఖాలు వెలుగునీడల్లా వెంటాడుతూనే ఉంటాయి. గెలుపుతో పొంగిపోకుండా, ఒటమికి కుంగిపోకుండా సమత్యాలం సాధించడమే జీవిత పరమార్థం.

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment