ఓ నా రామయ్య (O Na Ramayya) bhakthi సాంగ్ లిరిక్స్, Nalgonda Gaddar

by Lakshmi Guradasi

ఎండలేసిన కోలా అది ఎండి కోలా ఓ నా రామయ్య
అది ఎండి కోలా ఓ నా రామయ్య,..2
బయిలేసిన కోలా అది బంగరు కోలా ఓ నా సీతమ్మ
అది బంగారు కోలా ఓ నా సీతమ్మ..2
కట్టరా కాలు గజ్జె
కొట్టరా డప్పు దరువు
వెయ్యరా కాలు అడుగు సిర్రతో చిటికెర..
శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమ..
ఓహో శంకర రావయ్యా జంగమ ఆ ఆహా లింగమా..2

బాజాట్లేసే భజన అది భక్తి భజన ఓ నా రామయ్య..
అది ముక్తి భజన ఓ నా రామయ్య..2
సేవల్లేసే భజన అది చెక్క భజన ఓ నా రామయ్య..
అది గజ్జల భజన ఓ నా సీతమ్మ..2
పట్టరా భజనలు
కొట్టరా చిడతలు
వెయ్యరా అడుగులు
భక్తితో చిందులు
బలే బలే బలే బలే బలే బలే
హర హర శంకరమూర్తి లింగమూర్తి లెగుమ ఓహో ఈశ్వర
లేవయ్యా శంకరా మా బోలా శంకర..2

పెద్దలు ఏసేటి కోల పరమేశ్వర కోలా ఓ నా రామయ్య
పరమాత్మ కోలా ఓ నా రామయ్య..2
బాలలు వేసేటి కోల భగవంతుని కోలా ఓ నా సీతమ్మ
భలే భక్తి కోలా ఓ నా సీతమ్మ …2
కొట్టరా కోలాటం..
అల్లరా జడలల్లిక
వెయ్యరా జడ కొప్పు
సీతమ్మ సిక్కు రా…
అరే అరే అరే అరే
రామా రామా మూర్తి రామమూర్తి లెగుమ ఓహో శ్రీ రామ
రావయ్యా లక్ష్మణా ఆహా జై రామ..2

భక్తుల్లేసే భజన అది భక్తి భజన ఓ నా రామయ్య
అది భక్తుల భజన ఓ నా రామయ్య…
వీరుల్లేసే భజన అది వీర భజన ఓ నా సీతమ్మ
విశ్వమంతా భజన ఓ నా సీతమ్మ …
పూజలే చేయాలి
పుణ్యమే జరగాలే
పాపమే పోవాలే
దోషమే తొలగాలే
ఆడే ఆడే ఆడే డే…
శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమ..
ఓహో శంకర రావయ్యా జంగమ ఆ ఆహా లింగమా..

__________________

Song Credits:

పాట పేరు: ఓ నా రామయ్య (O na ramayya)
సాహిత్యం: బూతం రమేష్ (Butham Ramesh)
సంగీత దర్శకుడు: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
గానం: నల్గొండ గద్దర్ నర్సన్న (Nalgonda Gaddar Narsanna)
నిర్మాత: డీజీ శివ వంగూర్ (Djshiva Vangoor)

See Also plz click on this: mudu-kannula-vada-shivudu-song-lyrics-nalgonda-gaddar

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like