Home » నిలువనివ్వదే (Niluvanivvade) Lyrics Vijai Bulganin

నిలువనివ్వదే (Niluvanivvade) Lyrics Vijai Bulganin

by Lakshmi Guradasi
136 views
Niluvanivvade song lyrics shanmukh jaswanth

ఉలుకుల పలుకుల తొలకరి చినుకుల మేఘమా
మెరిసే మేఘమా
మెలికల తళుకుల కిలకిల చిలకల రాగమా
ఎదలో రాగమా

మాటలకందని మౌనమిది
ఏ భాషకి అందని భావమిది
నా చూపులకే పడిగాపులునే
నేర్పిన తీయని తుంటరి యాతన ఇది
ఊహకి తెలియని తొందర ఇది
ఏ కంటికి దొరకని అల్లరి ఇది
మనసు అందుకనే కనుసైగలతోనే
లేఖలు నీకే పంపినది

ఈ హాయి బాగుందిలే
నీ వైపు లాగిందిలే

చల్లగాలి నన్ను తాకినా
నువ్వు తాకినట్టు భావన
నిలువనివ్వదే ప్రాణం, నిలువనివ్వదే
ఇంటి ముందు పూలు పూసినా
నువ్వు పిలిచినట్టు వాసన
నిలువనివ్వదే ప్రాణం, నిలువనివ్వదే

ఉలుకుల పలుకుల తొలకరి చినుకుల మేఘమా
మెరిసే మేఘమా

నువ్వు నేను దూరం, ఉన్నామంటే అర్థం
ఏదో రోజు ఏకం, అవుతామనే..
అలా మనం ఏకం, అయ్యే రోజు కోసం
భరిస్తూనే ఉందాం ఈ బాధనే..
చిలిపిగా తెలిపిన వలపుల గుసగుసలన్నీ విన్నాలే
ఎవరికీ తెలియని అడుగుల కదలికలన్నీ చూశాలే

నిజం, నిజం, నిజం
ఇది మరి నిజం, నిజం, నిజం…

అందమైన చందమామలా
మేడ మీద నువ్వు నడవగా
నిలువనివ్వదే ప్రాణం, నిలువనివ్వదే
అద్దమల్లే నువ్వు మారగా
నన్ను నీలో చూపుతుండగా
నిలువనివ్వదే ప్రాణం, నిలువనివ్వదే

ఉలుకుల పలుకుల తొలకరి చినుకుల మేఘమా
మెరిసే మేఘమా
మెలికల తళుకుల కిలకిల చిలకల రాగమా
ఎదలో రాగమా

దగ్గర దగ్గర, దూరమిది,
ఓ తేలిక, తేలిక, భారమిది
ఈ ఉక్కిరి బిక్కిరి, ఉప్పెనలో పడి, తప్పడి, పోయెను గుండెసడి
నచ్చిన నచ్చిన, కష్టం ఇది, ఏ లెక్కకి చిక్కని, ఇష్టమిది
మరి నువ్వటు పక్కన, నేను ఇటు పక్కన, ఎక్కడికక్కడ చిక్కుముడి

దోబూచులేంటో ఇలా
దొంగాటలెన్నాళ్ళిలా

కాలమెంత కాపు కాసినా, నీకు నాకు గీత గీసినా
నిలువనివ్వదే ప్రాణం, నిలువనివ్వదే
లోకమెంత దారి మూసినా, నిన్ను నన్ను వేరు చేసినా
నిలువనివ్వదే ప్రాణం, నిలువనివ్వదే

నిలువనివ్వదే.. నిలువనివ్వదే
నిలువనివ్వదే ప్రాణం, నిలువనివ్వదే

In English Version:

Ulukula Palukula Tholakari Chinukula Meghamaa
Merise Meghamaa
Melikala Thalukula Kilakila Chilakala Raagamaa
Edhalo Raagamaa

Maatalakandani Mounamidhi
Ye Bhaashaki Andani Bhaavamidhi
Naa Choopulake Padigaapulune
Nerpina Theeyani Thuntari Yaathana Idhi
Oohaki Theliyani Thondara Idhi
Ye Kantiki Dorakani Allari Idhi
Manasu Andukane Kanusaigalathone
Lekhalu Neeke Pampinadhi

Ee Haayi Baagundhile
Nee Vaipu Laagindhile

Challagaali Nannu Thaakinaa
Nuvvu Thaakinattu Bhaavana
Niluvanivvadhe Praanam, Niluvanivvadhe
Inti Mundhu Poolu Poosinaa
Nuvvu Pilichinattu Vaasana
Niluvanivvadhe Praanam, Niluvanivvadhe

Ulukula Palukula Tholakari Chinukula Meghamaa
Merise Meghamaa

Nuvvu Nenu Dooram, Unnaamante Ardham
Edho Roju Ekam, Avuthaamane
Alaa Manam Ekam, Ayye Roju Kosam
Bharisthoone Undhaam Ee Baadhane
Chilipigaa Thelipina Valapula Gusagusalanni Vinnaale
Evariki Theliyani Adugula Kadalikalanni Chooshaale

Nijam, Nijam, Nijam
Idhi Mari Nijam, Nijam, Nijam…

Andhamaina Chandamaamalaa
Meda Meedha Nuvvu Nadavagaa
Niluvanivvadhe Praanam, Niluvanivvadhe
Addhamalle Nuvvu Maaragaa
Nannu Neelo Chooputhundagaa
Niluvanivvadhe Praanam, Niluvanivvadhe

Ulukula Palukula Tholakari Chinukula Meghamaa
Merise Meghamaa
Melikala Thalukula Kilakila Chilakala Raagamaa
Edhalo Raagamaa

Daggara Daggara, Dooramidhi
O Thelika Thelika Bhaaramidhi
Ee Ukkiri Bikkiri Uppenalo Padi, Thappadi, Poyenu Gundesadi
Nachchina Nachchina Kashtam Idhi
Ye Lekkaki Chikkani Ishtamidhi
Mari Nuvvatu Pakkana, Nenu Itu Pakkana, Ekkadikakkada Chikkumudi

Doboochulentho Ilaa
Dongaatalennaallilaa

Kaalamentha Kaapu Kaasinaa, Neeku Naaku Geetha Geesinaa
Niluvanivvadhe Praanam, Niluvanivvadhe
Lokamentha Daari Moosinaa, Ninnu Nannu Veru Chesinaa
Niluvanivvadhe Praanam, Niluvanivvadhe

Niluvanivvadhe… Niluvanivvadhe
Niluvanivvadhe Praanam, Niluvanivvadhe

__________________

Song Credits:

సాంగ్ : నిలువనివ్వదే (Niluvanivvade)
మ్యూజిక్ కంపోజర్: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
లిరిసిస్ట్: సురేష్ బనిశెట్టి (Suresh Banisetti)
గాయకుడు: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
నటీనటులు : షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth)‬ | చందన పాయవుల (Chandana Payaavula)
డైరెక్షన్ డాప్ స్టోరీ ఎడిటింగ్ – వినయ్‌షన్ముఖ్ (Vinay shanmukh )

See Also: koyila song lyrics alekhya harika

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.