Home » నిజమా కలా (Nijamaa Kalaa) సాంగ్ లిరిక్స్ – Lucky Baskhar

నిజమా కలా (Nijamaa Kalaa) సాంగ్ లిరిక్స్ – Lucky Baskhar

by Lakshmi Guradasi
0 comment
201

నిజమా కలా నిజమా కలా
నీ ఊహలే వాలాయిలా…గా
సాగేదెలా సాగేదెలా
నీ ప్రయాణమే అగిందిలా…గా

నువ్వు పంచిన నవ్వులు
పూచిన పూవ్వులు
వంచన లిచ్చినవేగా

వెలిగించిన వెలుగులు
తొలగిన వేడే ముంచేస్తాయి గా
నిన్ను నమ్మిన ఆశలు అల్లిన నీడలు
కలగా మార్చేసావా ..
మరి ఎప్పుడైనా నిన్ను ప్రశ్నించవా…

గెలిచావో ఓడవో
నువ్వే ఎదిగావో మునిగావో
నువ్వే వెతికావో చితికావో
నీ కథలో..

ఎగిసావో ముగిసావో
నువ్వే కురిసావో వెలిసావో
నువ్వే సాగవో అలిసావో
పర్వంలో .. ప్రయాణంలో
ప్రయాణంలో ..

జారే మాటలే పెదవినే చేరున
చేసిన తప్పులే ఒప్పుగా మారున
వర్షం నీటిలో కాగితం పడవలె
కాలం కడలిలో తీరమే చూపున
జరిగేలా ఓ అద్భుతం మారేలా గతం
నిన్నే నువ్వు అన్వేషించరా
కొత్తగా ఈ క్షణం

నువ్వు వెళ్లిన దారిన గమ్యము
లేదని తెలిసెను గా నడిచాక
మొదలయిన చోటికి తిరిగొస్తావో…

గెలిచావో ఓడవో
నువ్వే ఎదిగావో మునిగావో
నువ్వే వెతికావో చితికావో
నీ కథలో..

ఎగిసావో ముగిసావో
నువ్వే కురిసావో వెలిసావో
నువ్వే సాగవో అలిసావో
పర్వంలో .. ప్రయాణంలో
ప్రయాణంలో ..

_________________________________________

పాట పేరు: నిజమా కలా (Nijamaa Kalaa)
చిత్రం: లక్కీ బాస్కర్ (Lucky Baskhar)
గాయకులు: కృష్ణ తేజస్వి (Krishna Tejasvi)
సాహిత్యం: శ్రీమణి (Shreemani)
సంగీతం : జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)
నటీనటులు: దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)
రచయిత & దర్శకుడు: వెంకీ అట్లూరి (Venky Atluri)
నిర్మాత: నాగ వంశీ ఎస్ (Naga Vamsi S) – సాయి సౌజన్య (Sai Soujanya)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version