ఆ చురుకు చినుకులే కురవగా
దోసిల్లో ముత్యమై మెరవగా
పాదాలు కదపమని అడగగా
పట్టిలు పద పద అని నడువగా
ఆ చురుకు చినుకులే కురవగా
దోసిల్లో ముత్యమై మెరవగా
పాదాలు కదపమని అడగగా
పట్టిలు పద పద అని నడువగా
ఆ చినుకే నా వెనకే వెంటాడేస్తూ జారగా
అరెరే వాన వల్లప్ప అంటూ పడేస్తున్నాలే
మైమరిచి ఆ మబ్బులకే మానసిచ్చేసానే
వాన వల్లప్ప అంటూ పడేస్తున్నాలే
మైమరిచి ఆ మబ్బులకే మానసిచ్చేసానే
జాలువారేనే జలపాతం
ఆ పుడమి పరిమళం నా సొంతం
మంజీరనాధమే నీ శబ్దం
మయూరి నాట్యమే నాకిష్టం
జాలువారేనే జలపాతం
ఆ పుడమి పరిమళం నా సొంతం
మంజీరనాధమే నీ శబ్దం
మయూరి నాట్యమే నాకిష్టం
అదిగో అదిగదిగో నాపై నీ ప్రేమను చూపావా
ఇదిగో ఇదిగిదిగో నీ వడిలో వరదను చూసావా
నా మనసే విరబోసే పువ్వల్లే మారింది
వాన వల్లప్ప అంటూ పడేస్తున్నాలే
మైమరిచి ఆ మబ్బులకే మానసిచ్చేసానే
కు వాన వల్లప్ప అంటూ పడేస్తున్నాలే
మైమరిచి ఆ మబ్బులకే మానసిచ్చేసానే
నవ్వుతున్న మబ్బును చూసి
ఆ చల్ల గాలి చక్కిలిగీసి
చెట్టెమ్మ చెంత నీరును దులిపి
తనువంతనే తాకిడి కుదిపి
నవ్వుతున్న మబ్బును చూసి
ఆ చల్ల గాలి చక్కిలిగీసి
చెట్టెమ్మ చెంత నీరును దులిపి
తనువంతనే తాకిడి కుదిపి
నా అడుగై మడుగుల్లో
మువ్వల్లే చిటపటలాడింది
ఆ మడిలో సవ్వడితో
సరదాగా సందడి చేశాలే
జలతారై గగనంలో నే విహరిస్తున్నలే
అరెరే వాన వల్లప్ప అంటూ పడేస్తున్నాలే
మైమరిచి ఆ మబ్బులకే మానసిచ్చేసానే
వాన వల్లప్ప అంటూ పడేస్తున్నాలే
మైమరిచి ఆ మబ్బులకే మానసిచ్చేసానే
________________________________________
పాట: ఆ చురుకు చినుకులే (Aa Churuku Chinukule)
సంగీతం, సాహిత్యం & ట్యూన్: సంతోష్ షెరి (Santhosh Sheri)
లీడ్: అశ్రిత నాయర్ (Asritha Nair)
గాయని : వైష్ణవి కొవ్వూరి ( Vaishnavi Kovvuri)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.