Home » నిజామా కలా (Nijamaa Kalaa) సాంగ్ లిరిక్స్ – లక్కీ భాస్కర్ (Lucky Baskhar)

నిజామా కలా (Nijamaa Kalaa) సాంగ్ లిరిక్స్ – లక్కీ భాస్కర్ (Lucky Baskhar)

by Lakshmi Guradasi
0 comments
Nijamaa Kalaa song lyrics Lucky Baskhar

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమా థియేటర్ లలో అక్టోబర్ 31 న 2024 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరియు OTT లో 28 నవంబర్ 2024 న విడుదల అయింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో, Sithara Entertainments మరియు Fortune Four CInemas బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రం లో భాస్కర్ (దుల్కర్ సల్మాన్), రాంకీ (ఆంటోనీ) తో కలిసి ఎలక్ట్రానిక్స్ ఎక్సపోర్ట్స్ లో స్మగ్లింగ్ చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తాడు. అతను బాగా డబ్బులు సంపాదించక విలువలు తగ్గిపోతాయి. మనుషులను తక్కువగా చేసి చూస్తాడు. ఆ సమయం లో తన భార్య అయినా సుమతి (మీనాక్షి చౌదరి) తాను ఒకప్పటి భాస్కర్ లా లేడు అని తనని తనకి గుర్తు చేస్తూ మందలిస్తుంది. ఆ సమయం లో తాను కన్న కలలు ఎటు వైపు వెళ్తున్నాయో, వాటిని అందుకునే పని లో తనని తాను గెలిచాడా లేదా ఓడాడ అని తనని తాను ప్రశ్నించుకుంటున్న సమయం లో వచ్చే పాట ఈ “నిజామా కలా”. శ్రీమణి గారు నిజంగా ఈ పాటకి తన కలం తో గొప్ప సాహిత్యాన్ని అందించారు. జీవీ ప్రకాష్ సంగీతం ఈ పాటకు ఇంకా గొప్ప గుర్తింపు ని తెచ్చి పెట్టింది.

నిజమా కలా నిజమా కలా
నీ ఊహలే వాలాయిలా…గా
సాగేదెలా సాగేదెలా
నీ పయణమే ఆగిందిలా…గా

నువ్వు పంచిన నవ్వులు
పూచిన పూవ్వులు
వంచన లిచ్చినవేగా

వెలిగించిన వెలుగులు
తొలగిన వేడే ముంచేస్తాయి గా
నిన్ను నమ్మిన ఆశలు అల్లిన నీడలు
కలగా మార్చేసావా ..
మరి ఎప్పుడైనా నిన్ను ప్రశ్నించవా…

గెలిచావో ఓడవో
నువ్వే ఎదిగావో మునిగావో
నువ్వే వెతికావో చితికావో
నీ కథలో..

ఎగిసావో ముగిసావో
నువ్వే కురిసావో వెలిసావో
నువ్వే సాగవో అలిసావో
పర్వంలో .. ప్రయాణంలో
ప్రయాణంలో ..

జారే మాటలే పెదవినే చేరున
చేసిన తప్పులే ఒప్పుగా మారున
వర్షం నీటిలో కాగితం పడవలె
కాలం కడలిలో తీరమే చూపున
జరిగేలా ఓ అద్భుతం మారేలా గతం
నిన్నే నువ్వు అన్వేషించరా
కొత్తగా ఈ క్షణం

నువ్వు వెళ్లిన దారిన గమ్యము
లేదని తెలిసెను గా నడిచాక
మొదలయిన చోటికి తిరిగొస్తావో…

గెలిచావో ఓడవో
నువ్వే ఎదిగావో మునిగావో
నువ్వే వెతికావో చితికావో
నీ కథలో..

ఎగిసావో ముగిసావో
నువ్వే కురిసావో వెలిసావో
నువ్వే సాగవో అలిసావో
పర్వంలో .. ప్రయాణంలో
ప్రయాణంలో ..

Nijamaa Kalaa Nijamaa Kalaa
Nee Oohale….Vaalayila gaa…
Saagedelaa…..Saagedelaa…..
Nee Payaname Aagindilaaga

Nuvvu Penchina Navvulu
Poosina Puvvulu
Vanchana Lichinavegaa

Veliginchina Velugulu
Tholigina Vele Munchesthayeegaa
Ninnu Nammina Aashanu
Aallina Needanu
Kalaga Maarchesava
Mari Eppudaina Ninnu Prachinchava

Gelichavo Odavo Nuvve
Yedigaavo Munigaavo Nuvve
Prathikavo Chithikaavo
Nee Kathalo…oo….

Yegisavo Mugisavo Nuvve
Kurisavo Velisaavo Nuvve
Saagavo Alisaavo Parvamloo….
Prayanamlo….
Prayanamlo……

Jaare Maatale Pedavine Cheruna
Chesina Thappule Oppuga Maaruna
Varsham Neetilo Kaagitham Padavale
Kaalam Kadalilo Theeram Choopuna
Jarigelaa O Adbhutam
Maarelaa Gatham
Ninne Nuvvu Anveshinchara
Kotthagaa Ee Kshanam

Nuvvellina Daarina Gamyamu
Ledani Thelisenugaa Nadichaka
Modalayyena Chotuku Tirigosthaavo

Gelichavo Odavo Nuvve
Yedigaavo Munigaavo Nuvve
Brathikavo Chithikaavo
Nee Kathalo…oo….

Yegisavo Mugisavo Nuvve
Kurisavo Velisaavo Nuvve
Saagavo Alisaavo Parvamloo….
Prayanamlo….
Prayanamlo……

పాట పేరునిజమా కలా (Nijamaa Kalaa)
చిత్రంలక్కీ బాస్కర్ (Lucky Baskhar)
గాయకులుకృష్ణ తేజస్వి (Krishna Tejasvi)
సాహిత్యంశ్రీమణి (Shreemani)
సంగీతంజివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)
నటీనటులుదుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)
రచయిత & దర్శకుడువెంకీ అట్లూరి (Venky Atluri)
నిర్మాతనాగ వంశీ ఎస్ (Naga Vamsi S) – సాయి సౌజన్య (Sai Soujanya)

Srimathi Garu Song Lyrics Lucky Bhaskar

Q. Who is the singer of Nijama Kala song in Lucky Bhaskar?
ANS: Krishna Tejaswi

Q. Which banner produced Lucky Bhaskar?
ANS: Sithara Entertainments and Fortune Four CInemas.

Q. Who is the producer of Lucky Bhaskar?
ANS: Suryadevara Nagavamsi and Sai Soujanya produced the movie under SIthara Entertainments and Fortune Four Cinemas.

Q. Is Lucky Bhaskar movie hit or flop?
ANS: Lucky Bhaskar was super hit at the box office. It was the first movie of dulquer salman to enter into the 100 crore club. The totally grossed approximately 107crores.

Q. Dulquer Salman remuneration for Lucky Bhaskar film?
ANS: dulquer received 10CR for his role in Lucky Bhaskar.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.