Home » నేను తానని – ఓ మై ఫ్రెండ్

నేను తానని – ఓ మై ఫ్రెండ్

by Firdous SK
0 comment
95

నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా
స్నేహం మొహం రెండు వేరని తెలిసి తప్పుకుపోతారా
హోం హోం

ఒక చోటే ఉంటూ ఒకటే కల కంటూ
విడి విడిగా కలిసే వుండే కళ్ళది ఏ బంధం
కలకాలం వెంటే నడవాలనుకుంటే
కాళ్లకు ఓ ముడి ఉండాలని ఎందుకు ఈ పంతం

చుట్టరికముందా చెట్టుతో పిట్టకేదో
ఏంలేకపోతే గూడు కడితే నేరమా
ఏ చెలిమి లేదా గట్టుతో ఎటి కేదో
వివరించమంటే సాధ్యమా

నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా
స్నేహం మొహం రెండు వేరని తెలిసి తప్పుకుపోతారా

కనులకు కనిపించే రూపం లేకుంటే
ప్రాణం తానున్నానన్నా నమ్మం అంటారా
చెవులకు వినిపించే సవ్వడి చేయందే
గుండెల్లో కదిలే నాదం లేదని అంటారా

మదిలోని భావం మాటలో చెప్పకుంటే
అటువంటి మౌనం తగనిదంటూ అర్థమా
తీరాన్ని నిత్యం ఆలా అలా తాకుతుంటే
నిలిపే నిషేధం న్యాయమా

నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా
స్నేహం మొహం రెండు వేరని తెలిసి తప్పుకుపోతారా
హోం హోం

పాట: నేను తానని
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గాయకులు: రంజిత్
సినిమా: ఓ మై ఫ్రెండ్
తారాగణం: హన్సిక, నవదీప్, శృతి హాసన్, సిద్ధార్థ్
సంగీత దర్శకుడు: రాహుల్ రాజ్

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version