Home » గుండు సూది గుండు సూది – ఛత్రపతి

గుండు సూది గుండు సూది – ఛత్రపతి

by Hari Priya Alluru
0 comment
73

గుండుసూది గుండుసూది

గుచ్చుకుంది గుండుసూది

గుంజిందయ్యో గుండె నాది

గుట్టులాగిందయ్యో పండు లోది

గుండుసూది గుండుసూది

గుచ్చుకుంటే తప్పు నాది

తగ్గించనా నెప్పి నీది

హాయి తెప్పించనా ఊది ఊది

తగిన వేళల తొలిసారి

తెగని వేళల మలిసారి

హే పడక వేళల ప్రతిసారి

పగటి వేళల ఒకసారి

ఈ కోప తాపాలన్ని తీరేలాగ నన్నే

ఊపాలి బ్రహ్మచారి

నీ గోరు వంకల్లోన చేరేవేళ నేనే

అయిపోనా భామచారి

అమ్మమ్మ అబ్బబ్బబ్బా

హయ్యయ్యయ్యో అంతా వినక

అచ్చచ్చో చిచ్చో పిచ్చో

సిగ్గులకే సెలవిచ్చో వచ్చేయి వెనక

చూపాలయ్యో ఊపు నీది

నాకు చెప్పాలయ్యో తీపి సోది

గుండుసూది గుండుసూది

గుచ్చుకుంటే తప్పు నాది

గుంజిందయ్యో గుండె నాది

గుట్టులాగిందయ్యో పండు లోది

నీకు బోలెడు అది ఉంది

నాకు బుట్టెడు ఇది ఉంది

ఉఁ ఎత్తిపోతల పదునుంది

ఉక్కపోతల పని ఉంది

మత్తుల్లో గమ్మత్తుల్లో ముంచెత్తాలి నేడే

తేనెల్లో ఈది ఈది

చాటుల్లో మాటుల్లోన ఆడే ఆటల్లోన

మారాలి తేది తేది

ఇంకింకా ఇంకా ఇంకా

కావాలింకా అహా చురక

స్త్రీలంక చూడాలింకా

నాతోనే కూడింక ఛీపో అనక

నచ్చావయ్యో ఉగ్రవాది

నిన్ను చేసెయ్యనా జన్మ ఖైదీ

గుండుసూది గుండుసూది

గుచ్చుకుంటే తప్పు నాది

గుంజిందయ్యో గుండె నాది

హాయి తెప్పించనా ఊది ఊది

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version