అధిక బరువుతో బాధపడే వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజు మనం తినే ఆహారాన్ని మరియు మన జీవన శైలిని చాల మంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అటువంటి వారి కోసం అధిక బరువును నివారించడం ఎలా అని తెలుసుకుందాం.
ఇప్పుడు కొన్ని టిప్స్ ను చూద్దాం
1. రోజు తప్పనిసరిగా విరామంతో కూడిన వ్యాయామం చేయాలి, ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది, అంతేకాకుండా బరుగు తగ్గించుటలో ఇది ఎంతగానో సహాయ పడుతుంది.
2. పచ్చి పళ్ళూ, పచ్చి కూరగాయలు తినడం వల్ల కూడా అధికబరువు తగ్గించుటలో సహాయపడుతుంది.
3. కొవ్వు కరిగించే గుణాలు అధికంగా ఉన్న “గ్రీన్ టీ” తీసుకోవడం ఎంతో మంచిది.
4. పీచు, ప్రొటీన్లు అధికముగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల కుడా మెరుగైన ఫలితం ఉంటుంది.
5. ఆహారంలో ఉప్పు శాతం తగ్గించి తీసుకోవడం ఎంతో అవసరం.
6. రోజూ వారి పనులలో చాల చురుకుగా ఉండాలి.
7. ఉదయాన్నే లేచి సహజ మరియు సరియైన వ్యాయామ పద్ధతులు పాటించాలి, సరైన వ్యాయమం చేయాలి.
8. మీ శరీరంలో కొవ్వు కరిగించే శక్తి పెరగాడానికి, ఆల్పాహారం మనివేయడం ఎంతో అవసరం.
9. “లిఫ్ట్” కి బదులు మెట్లు ఉపయోగిస్తే ఎంతో మంచిది.
10. మీ పనిలో అలసట కలిగినపుడు సంగీతం వినండి.
11. మాంసాహారనికి దూరంగా ఉంటూ శాఖాహార భోజనం తీసుకోవడం ఎంతో అవసరం.
12. ఆహారం తేసుకునే ముందు నీరు లేదా జూస్ మంచిది.
13. విటమిన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం.
14. అధికంగా మీ క్యాలరీస్ ని తగ్గించుకోవడం మంచిది.
15. పగటి పూట నిద్ర పోరాడు.
16. ఆహారాన్ని మింగివేయవద్దు, మెల్లగా నములుతూ తినండి.
17. ఏదైనా తినే ముందు క్యాలరీ పట్టిక చూసుకోవడం ఎంతో అవసరం.
18. టీవీ చూడడం, ఆటలు ఆడడం వంటివి బరువు తగ్గడానికి మంచివి కావు.
19. మీ భోజన ప్రణాలికలను మార్చుకోవటం వలన సులభంగా శరీర బరువు తగ్గించుకోవచ్చు. కింద తెలిపిన ఆహార పదార్థాలు స్త్రీల శ్రీధర బరువును త్వరగా తగ్గిస్తాయి మరియు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి.
బరువు తగ్గాలి అనుకునే వారు తప్పక కలుపుకోవాల్సిన ఆహర పదార్థాలు
- తాజా పండ్లు
- కూరగాయలు
- బార్లీ
- బ్రౌన్ రైస్
- పప్పులు
- ఉప్పులేని విత్తనాలు
- టోఫు
- బంగాళదుంప
- ఆలివ్ ఆయిల్
- సలాడ్
- తక్కువ ఫొటో ఉన్న యోగర్ట్
మహిళలకు బరువు తగ్గించే డైట్ ప్లాన్
తినకూడని ఆహారాలు:
బరువు తగ్గాలి అనుకునే స్త్రీలు పాటించే ఆహార ప్రణాళికలో ఉండకూడని ఆహర పదార్థాల క్రింద పేర్కొనబడ్డాయి.
- ఆల్కహాల్
- ఫ్రీజ్ లో ఉంచిన ద్రావణాలు
- సోడా
- టీ మరియు కాఫీ
- బిస్కెట్లు
- రైస్
- కేక్
- కోకో
- జామ్
- పాస్తా
- ప్యాక్ చేసిన సూప్
- చక్కెరలను కలిపిన ఆహర పదార్థాలు
- నీటిని ఎక్కువగా తీసుకోండి
సోడాలను తీసుకునే బదులుగా నీటిని ఎక్కువగా తాగండి నీటి నుండి మీ శరీరానికి ఎలాంటి క్యాలోరీలు అందింపబడవు, శరీరానికి తాకువ క్యాలోరీలు చాలా మంచిదే మరియు బరువు కూడా త్వరగా తగ్గుతారు.
గ్రీన్ టీ
గ్రీన్ టీని రోజు తాగటం వలన శరీర జీవక్రియ రేటు పెరుగుతుంది. ఫలితంగా శరీర బరువు కూడా తగ్గుతుంది. గ్రీన్ టీలో చక్కెరలను కలపకూడదు. గ్రీన్ టీ నుండి వచ్చే చేదు రుచిని తరించుటకు తులసి ఆకులను కలుపుకోండి.
బరువు తగ్గడానికి డైట్ ప్లాన్
కొవ్వును కరిగించే పోషకాలు:
శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను కరిగించే పోషకాలను మీ ఆహార ప్రణాళికలో కలుపుకోండి. కాల్షియం వంటి ముఖ్య పోషకాలు మరియు ప్రోటీన్’లు మీ శరీరంలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను కరిగిస్తాయి. రోజు తినే ఆహారంలో 1,200 నుండి 1,300 మిల్లి గ్రాముల కాల్షియం తీసుకునే వారిలో శరీర బరువు త్వరగా తగ్గుతుంది అని “టెన్నెస్సీ” అనే యూనివర్సిటీ వారు పరిశోధనలు జరిపి వెల్లడించారు. ఆహరం ద్వారా పొందే కాల్షియం రెండు రకాలుగా కొవ్వు పదార్థాల విషయంలో సహాయపడుతుంది. అవి మొదటగా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును జీవక్రియలో వినియోగింప చేస్తుంది. రెండోది శరీరంలో నూతన కొవ్వు ఏర్పాటును నిలిపి వేస్తుంది.
ఆకలిని తగ్గించే ఆహారాలు
ద్రాక్ష పండ్లు, దాల్చిన చెక్క మరియు అధికంగా ఫైబర్ ఉండే ఆహర పదార్థాలు ఆకలిని తగ్గించి వేస్తాయి. జీర్ణాశయం నిండినట్టుగా ఉండటం వలన కూడా ఇతర ఆహారాలను తినలేరు. ఓట్మీల్, బీన్స్, కూరగాయలు బ్రౌన్ రైస్ వంటి పైబర్ అధికంగా ఉన్న ఆహారాలను బరువు తగ్గించుకోవటానికి తయారు చేసుకున్న ఆహర ప్రణాళికలో కలుపుకోండి. వీటి వలన మీ శరీర బరువు తగ్గటంతో పాటూ, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
తక్కువ క్యాలోరీల ఆహరం
తక్కువ క్యాలోరీలు ఉన్న ఆహారాలను కూడా మీ బరువు తగ్గించే ఆహార ప్రణాళికలో కలుపుకోండి. నీటి వలన శరీరానికి తక్కువ స్థాయిలో మాత్రమె క్యాలోరీలు అందించబడతాయి. తక్కువ క్యాలోరీలను అందించే పండ్లు మరియు కూరగాయలను తినండి. ఉదాహరణకు- ఆకుకూరలు, బ్రోకలీ, ద్రాక్ష పండ్లు, నిమ్మకాయ, ఆపిల్, పాలకూర, క్యాబేజీ, ఫైబర్లను, కార్బోహైడ్రేట్’లు, విటమిన్’లు పుష్కలంగా కలిగి ఉన్న ఆహారాలను తినటం వలన శరీరానికి తక్కువ క్యాలోరీలు అందుతాయి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.