Home » ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కి వాట్సప్ వల్ల ప్రమాదం. ఎందుకో తెలుసా!

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కి వాట్సప్ వల్ల ప్రమాదం. ఎందుకో తెలుసా!

by Vishnu Veera
0 comments
nara lokesh suffer with whatsapp

ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తరువాత అత్యంత బిజీగా ఉంటున్న నేత ఏపి మంత్రి నారా లోకేష్. ఏపి ముఖ్య మంత్రి చంద్రబాబు తరువాత ప్రభుతంలో నంబర్ టూగా చెలామణి అవుతున్న మంత్రి నారా లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెపుకుంటే వెంటనే పరిష్కారం అవుతున్నాయి. అని ఉద్దేశంతో మంత్రి ఐన నారా లోకేష్ ని కలిసేందుకు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో జనం ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా ఆయన నియోజకవర్గం మంగళగిరి ప్రజలతో పాటు ఇతరులు కూడా లోకేష్ ను వాట్సాప్ (WhatsApp) లో సైతం సంప్రదించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆయన వాట్సాప్ ఖాతా నిషేధించబడింది. మంత్రి ఐన నారా లోకేష్ తన X (Twitter) లో సొయంగా పోస్ట్ చేసాడు. ప్రజల నుంచి ఎక్కువగా వచ్చిన మెసేజ్‌లతో సాంకేతిక సమస్య తలెత్తి నా వాట్సప్ మెటా బ్లాక్ చేసింది. మీ సమస్యలు దయచేసి నాకు వాట్సప్ (WhatsApp) చేయొద్దు.

మీ సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి నా పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in పంపించండి. పాదయాత్రలో యువతకు నన్ను చేరువ చేసిన “హలో లోకేష్” కార్యక్రమం పేరుతోనే నా మెయిల్ ఐడి hello.lokesh@ap.gov.in క్రియేట్ చేసుకున్నాను.

మీ పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరిచి మెయిల్ చేయండి. మీకు సహాయం చేయడం, సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.