Home » నాగమల్లె చెట్టుకింద నాగరాజో సాంగ్ లిరిక్స్ – జానపద పాట

నాగమల్లె చెట్టుకింద నాగరాజో సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Lakshmi Guradasi
0 comment

అరె నాగమల్లెచెట్టు కింద
నాగమల్లెలు ఏరుతంటే
నాగరాజో నా మేనబావ
నాగరాజో నా మేనబావ

నాగమల్లెలు ఏరుతంటే
నల్లతేలు కుట్టినాది
నాగరాజో నా మేనబావ
నాగరాజో నా మేనబావ

నాగమల్లెలు ఏరుతంటే
నల్లతేలు కుట్టిపోయెనే
నాగరాజో నా మేనబావ
నాగరాజో నువ్వన్నా రావా

సుడాసక్కగున్ననాన్ని
సిట్ట సిట్ట గుట్టినాది
నాగరాజో సక్కాని బావ
నాగరాజో నా మేనబావ

ఎర్ర బుర్రగున్ననాన్ని
ఎక్కిరించి కుట్టినాది
నాగరాజో సక్కాని బావ
నాగరాజో నా వెండి బావ
నాగరాజో నా మేనబావ

సుక్కోలే ఉన్ననాన్ని
సిట్ట సిట్ట గుట్టిపాయెరో
నాగరాజో నా వెండి బావ
నాగరాజో నా మేనబావ

నాగులోళ్ల బయ్యికాడా
నల్ల మందు దంచుకొని
నాగరాజో కోమలైన బావ
నాగరాజో నువ్వైనా రావా

నల్ల మద్దిచెట్టు కింద
నాకు మందు పెట్టరాదు
నాగరాజో బంగారి బావ
నాగరాజో నా మేనబావ

సలువలొచ్చినట్టాయె
మందన్న పెట్టరాదురో
నాగరాజో బంగారి బావ
నాగరాజో సింగారి బావ

మా పాలజొన్నల కాంకి
పజాన్నోల సేనులోన
నాగరాజో సెరిగళ్ల బావ
నాగరాజో నా మేనబావ

పజాన్నోల సేనులోన
పాల బువ్వ సద్ది ఉంది
నాగరాజో వెన్నెల బావ
నాగరాజో వెండి బావ

బుద్ధిగళ్ల బావ వచ్చి
బువ్వన్న పెట్టరాదు రో
నాగరాజో వెన్నెల బావ
నాగరాజో వెండి బావ

మోదుగు చెట్లకింద
మొగలిపుల వాసన
నాగరాజో మొండి బావ
నాగరాజో మంచి బావ

మల్లెపూలు పెట్టుకుని
మంచే మీద కూసుంట
నాగరాజో నా పైడి బావ
నాగరాజో వెండి బావ

మంచే మీద ఒక్కదాన్ని
మల్లెపూలు పెట్టి చూత్తిరో
నాగరాజో నా పైడి బావ
నాగరాజో వెండి బావ

మా లవంగాల మొగ్గ నేను
లవ్ ఆడ రావు రా
నాగరాజో జోడైన బావ
నాగరాజో ఈడైన బావ

గున్నమామి చెట్టుకింద
గువ్వలు సెంటు చూడు
నాగరాజో వరసైన వాడ
నాగరాజో సొగసైన వాడ

నీ మీద మనసు నాది
నా చెయ్యి పట్టుకోవురో
నాగరాజో వరసైన వాడ
నాగరాజో సొగసైన వాడ

సూరుకింద నిలబడి
సుక్కోలే మెరిసేదాన
నాగమామి నీకు మందు పెడతాలే
నాగమామి నీ చెయ్యి పడతానే

చిగురాకు జబ్బాల్లా
నీలి కురులు మెరిసెనే
నాగమామి నిన్నేలుకుంటానే
నాగమామి నిన్నేత్తుకుంటానే

నువ్వు నేను గుడిపోంగా
నూరేళ్ళ బంధమైతదే
నాగమామి నూరేళ్ళ బంధమే
నాగమామి నీ తోడుగుంటానే

_________________________________

పాట: నాగమల్లె చెట్టుకింద నాగరాజో
సాహిత్యం – గాయకుడు & దర్శకుడు – సతీష్ పిట్టల (Sathish Pittala)
గాయని – నాగలక్ష్మి (Nagalaxmi)
నిర్మాత – అనిత పిట్టల (Anitha Pittala)
సంగీతం – మహేందర్ శ్రీరాముల (Mahendar Sriramula)
నటీనటులు – లాస్య స్మైలీ (Lasya Smiley), విక్కీ (vicky)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment